IND vs ENG : మూడోరోజు ఆటలో ఫీల్డింగ్‌కురాని రోహిత్ శర్మ.. కారణం ఏమిటంటే?

మూడోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాకపోవడానికి గల కారణంపై బీసీసీఐ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది.

IND vs ENG : మూడోరోజు ఆటలో ఫీల్డింగ్‌కురాని రోహిత్ శర్మ.. కారణం ఏమిటంటే?

Rohit Sharma

Rohit Sharma : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట శనివారం ప్రారంభమైంది. 473/8 ఓవర్ నైట్ స్కోర్ తో టీమిండియా బ్యాటర్లు కుల్ దీప్, బుమ్రాలు క్రీజులోకి వచ్చారు. మొదటి ఓవర్ లోనే ఆండర్సన్ వేసిన బంతికి కుల్ దీప్ యాదవ్ (30) ఔటయ్యాడు. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. కొద్దిసేపటికే బుమ్రా (20) ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 259 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, భారత్ ఫీల్డింగ్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాలేదు.

Also Read : Virat Kohli : క్రికెట్‌కు దూరంగాఉన్నా కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ..ఎలాగో తెలుసా?

మూడోరోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి రాకపోవడానికి గల కారణంపై బీసీసీఐ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించింది. వెన్నునొప్పి కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ ఫీల్డింగ్ సమయంలో మైదానంలోకి రాలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ.. నొప్పి తగ్గిన వెంటనే మైదానంలోకి వస్తారని తెలుస్తోంది. మరోవైపు భారత్ బౌలర్లు విజృంభిస్తున్నారు. అశ్విన్ స్పిన్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పడుతున్నారు. కేవలం 36 పరుగులకే ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయింది.

Also Read : Sunil Gavaskar : సర్ఫరాజ్.. ఆ చెత్త షాట్ అవసరమా? సునీల్ గవాస్కర్ కీలక సూచన