×
Ad

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్‌.. 300 లోడింగ్.. !

య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

IND WI 2nd Test Anil Kumble prediction 300 Loading For Yashasvi Jaiswal

Yashasvi Jaiswal : ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొడుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 173 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. దీంతో అత‌డిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే సైతం జైస్వాల్‌ను కొనియాడాడు. శ‌నివారం అత‌డు ట్రిపుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశాడు.

2023లో అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వ‌ర‌కు 25 టెస్టులు ఆడాడు. 49.9 స‌గటుతో 2వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచ‌రీలు 12 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇందులో విశేషం ఏంటంటే.. జైస్వాల్ చేసిన ఏడు శ‌త‌కాల్లో.. ఐదు ఇన్నింగ్స్‌ల్లో అత‌డు 150 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు.

IND vs WI 2nd Test : టీ బ్రేక్ స‌మ‌యంలో జైస్వాల్‌కు ఒక‌టే చెప్పాను.. బ్యాటింగ్ సితాన్షు కోట‌క్‌

అతడు చేసిన తొలి నాలుగు టెస్టు సెంచ‌రీలు 150 ప‌రుగుల మార్కును దాటాయి. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో రెండు శ‌త‌కాలు చేయ‌గా.. ఆ రెండింటిలో మాత్ర‌మే అత‌డు 150 ప‌రుగుల మార్కును దాట‌లేదు. శుక్ర‌వారం వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లోనూ 150 ప‌రుగుల‌ను దాటాడు.

‘జైస్వాల్ రోజు రోజు ఎంతో మెరుగుఅవుతున్నాడు. త‌న‌కోసం మాత్ర‌మే కాకుండా జ‌ట్టు కోసం ప‌రుగులు చేయాల‌నే ఆక‌లి అత‌డిలో క‌నిపిస్తోంది. గ‌త మ్యాచ్‌లో మంచి ఆరంభం ల‌భించినా భారీ స్కోరు న‌మోదు చేయ‌డంలో అత‌డు విఫ‌లం అయ్యాడు. అయితే.. దాన్ని నుంచి పాఠాలు నేర్చుకుని ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.’ అని కుంబ్లే అన్నాడు.

Jasprit Bumrah : జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏకైక పేస‌ర్‌..

‘అత‌డి కెరీర్ ఇప్పుడే మొద‌లైంది. అయిన‌ప్ప‌టికి అత‌డు ఆట పై చూపించే ప్రేమ బాగుంది. జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటే భారీగా ప‌రుగులు చేయాల‌ని చూస్తాడు. ఇది చూడ‌డానికి ఎంతో బాగుంది. శ‌నివారం కూడా అత‌డు భారీగా ప‌రుగులు సాధిస్తాడు. జైస్వాల్ ఇప్పుడు ముందు డ‌బుల్ సెంచ‌రీ మాత్ర‌మే కాదు.. ట్రిపుల్ సెంచ‌రీ కూడా చేయ‌గ‌ల గొప్ప అవ‌కాశం ఉంది. ‘అని కుంబ్లే చెప్పాడు.