Anushka And Virat Kohli : కోహ్లీ, అనుష్కల వివాహ వార్షికోత్సవ ఫొటోలు వైరల్.. అనుష్కశర్మ ఏమన్నదంటే?

అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలో భర్త విరాట్ ను కౌగిలించుకొని ఉంది. ఇద్దరు నలుపు దుస్తుల్లో ఉన్నారు. వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.

Virat Kohli and Anushka Sharma

Anushka And Virat wedding anniversary : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు 6వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విరాట్, అనుష్క వివాహం చేసుకోని సోమవారం (డిసెంబర్ 11) తో ఆరేళ్లు అవుతుంది. దీంతో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వారు 6వ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల్లో కోహ్లీ, అనుష్కలు మంగళవారం ఉదయం షేర్ చేశారు.

Also Read : New Rule in Cricket : అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే క్రికెట్‌లో కొత్త రూల్‌.. బౌల‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే..!

అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలో భర్త విరాట్ ను కౌగిలించుకొని ఉంది. ఇద్దరు నలుపు దుస్తుల్లో ఉన్నారు. వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే, సోమవారం వీరి వివాహ వార్షికోత్సవం కాగా.. ఇన్ స్టాగ్రామ్ లో వార్షికోత్సవ ఫొటోలను పోస్టు చేయడంలో జాప్యాన్ని కూడా అనుష్క ప్రస్తావించింది. ‘ప్రేమతో, స్నేహితులు, కుటుంబ సభ్యులతో నిండిన రోజున ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలను పోస్టు చేయడానికి చాలా ఆలస్యం అయిందని తెలిపింది. మరోవైపు విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో అనుష్కతో కలిసిఉన్న ఫొటోను పోస్టు చేశారు. ఇందులో ఇద్దరూ బ్లాక్ డ్రెస్సులో ఉన్నారు. ఈ ఫొటోలో అనుష్క విరాట్ ను వెనుక నుంచి కౌగిలించుకొని ఉంది.

Also Read : Mohammed Shami : ష‌మీ ఫామ్‌హౌస్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో అభిమానులు.. ఎందుకంటే..?

కోహ్లీ, అనుష్క శర్మ 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2021లో వారికి కుమార్తె జన్మించింది. వామికా అని పేరు పెట్టారు. వన్డే వరల్డ్ కప్ తరువాత విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లోనూ, ప్రస్తుతం సౌతాఫ్రికాతో భారత్ ఆడుతున్న టీ20 సిరీస్ లోనూ విరాట్ కు టీమిండియా సలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో సతీమణి అనుష్కతో కలిసి కోహ్లీ ఇతర దేశాల్లో హాలిడే ట్రిప్ లో ఉన్నాడు.