అనుష్కా.. ఇడ్లీనా: కోహ్లీ సీక్రెట్ చెప్పిన సునీల్ ఛెత్రి

అనుష్కా.. ఇడ్లీనా: కోహ్లీ సీక్రెట్ చెప్పిన సునీల్ ఛెత్రి

Updated On : June 22, 2021 / 12:42 PM IST

టీమిండియా కెప్టెన్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ గురించి సునీల్ ఛెత్రి నిజాలన్ని చెప్పేస్తున్నాడు. వాళ్లిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలుగా ఉన్న స్నేహం గురించి చెప్తూనే అనుష్క శర్మనా.. ఇడ్లీనా అనే విషయాన్ని బయటపెట్టాడు. భారత దేశ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రిలు చిరకాల మిత్రులుగా ఉన్నారు. వీరిద్దరూ ఇటీవల స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ మనోభావాలను ఇలా పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గానే కాదు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్స్ డైట్ అవార్డు ఇవ్వాలంటూ చమత్కరించాడు ఛెత్రి. కొన్ని నెలల కిందట పూర్తి స్థాయి వెజిటేరియన్‌గా మారినప్పటి నుంచి కోహ్లీతో టచ్‌లో ఉన్నానని తెలిపాడు. కోహ్లీ క్రికెటర్‌గా కనిపిస్తున్నా నిజానికి ఫుట్‌బాల్ ప్లేయర్ డైట్ ఫాలో అవుతాడంటూ కొనియాడాడు.

ఇంకా ఇలా నాన్ వెజ్ తినడం తాను మానేయడం గురించి మాట్లాడుతూ.. అతని భార్య అనుష్క శర్మ కూడా ఎప్పటి నుంచో వెజిటేరియన్‌గా ఉంటుందని ఒక రకంగా చూస్తే కోహ్లీ వెజిటేరియన్‌గా మారిపోవడానికి ఆమె కూడా కారణమై ఉండొచ్చని తెలిపాడు. ఇన్నాళ్లు బాగా నాన్ వెజ్‍‌ను తినేసిన నేను(ఛెత్రి)పూర్తి స్థాయి వెజిటేరియన్‌గా మారిపోవడానికి కారణం నాకు జంతువులంటే అమితమైన ప్రేమ అని నేను చెప్పను.

కోహ్లీ మాత్రం అనుష్క శర్మ తినే ఇడ్లీ ద్వారానే ప్రేరణ పొందాడేమో. అంటూ చమత్కరించాడు. ‘బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అని సచిన్‌ అన్నట్లు కోహ్లీ ఇడ్లీ గురించి చెప్తాడేమోనని కామెంట్ విసిరాడు. ఫిట్‌నెస్ పరంగా కోహ్లీ రోజురోజుకూ ఇంకా వృద్ధి సాధిస్తున్నాడు. ప్రతి ఆటలోనూ మార్పు చూపిస్తూ ఇంకా ఎదిగేందుకు కష్టపడుతుంటాడు. ఈ శైలిని విరాట్ నుంచే నేర్చుకున్నాను’ అని కెప్టెన్‍‌పై మరో కెప్టెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.