రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?

ఆ బిడ్డ పుట్టిన ఐదు రోజులకు విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులకు శుభవార్త. హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన ఐదు రోజులకు క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. తమ రెండో బిడ్డకు ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు చెప్పాడు.

అనుష్క కూడా ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ చేసింది. ఫిబ్రవరి 15న మగబిడ్డ పుట్టాడని విరుష్క జంట తెలిపింది. తమ కూతురు వామికకు తమ్ముడు పుట్టాడని పేర్కొంది.

‘అంబరాన్నంటే ఆనందంతో, మా హృదయం నిండా ప్రేమతో తెలుపుతున్నాం. ఫిబ్రవరి 15న మా మగబిడ్డ, వామికా తమ్ముడు అకాయ్‌కి ఈ ప్రపంచంలోకి స్వాగతం పలికాం. మీ ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి. ఇటువంటి సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవింవాలని కోరుతున్నాం’ అని విరుష్క జంట ప్రకటన చేసింది. విరుష్క జంట 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క, విరాట్‌ దంపతులకు వామికా పుట్టింది.

కాగా, కోహ్లీ, అనుష్క శర్మ జంటకు మరో శిశువు పుట్టబోతుందంటూ మొట్టమొదటిసారిగా దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఇటీవల రివీల్ చేశారు. ఇందుకోసమే కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ ఆడడం లేదని, ప్రస్తుతం అతను తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడని తెలిపాడు. డివిలియర్స్ వెల్లడించిన సమాచారంతో కొన్ని రోజుల క్రితం నుంచే కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్ బుల్లి కోహ్లీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ కోహ్లీ, అనుష్క స్వయంగా ఈ శుభవార్త తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు