Sara Tendulkar with her future sister-in-law Saaniya Chandok (on Sara’s right, wearing a green kurti) and other friends and family
Arjun Tendulkar News: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (25) తమ సన్నిహిత స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
పెళ్లికూతురు ఎవరో, ఆమె ఏం చేస్తుందో, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటో తెలుసా? పూర్తి వివరాలు చూద్దాం..
సానియా చందోక్ ముంబైలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. రవి ఘాయ్ నేతృత్వంలోని గ్రావిస్ గ్రూప్‌కు ‘ది బ్రూక్లిన్ క్రీమరీ’, ‘బాస్కిన్ రాబిన్స్’ వంటి ఐస్‌క్రీమ్ బ్రాండ్లు ఉన్నాయి.
ఆ కుటుంబం ముంబైలో ఇంటర్ కాంటినెంటల్ హోటల్ తో పాటు హాస్పిటాలిటీ, ఫుడ్ రంగాల్లో అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది.
గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.624 కోట్లు ఆదాయం రాబట్టి, అంతకుముందు ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధిని సాధించింది.
సానియా 2022 నుంచి ముంబైలోని మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ LLPలో డిజినేటెడ్ పార్ట్నర్, డైరెక్టర్ గా పని చేస్తోంది. ఉన్నత కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ సింపుల్‌గా ఉంటుంది. తన కుటుంబానికి వ్యాపారాల్లో సహకరిస్తూనే అర్జున్ తో తన కొత్త జీవితం కోసం సిద్ధమవుతోంది. (Arjun Tendulkar News)
అర్జున్ టెండూల్కర్ ఎడమచేతి వాట ఆల్‌రౌండర్. 2020-21 సీజన్ లో ముంబై తరఫున హరియాణాతో జరిగిన మ్యాచ్ లో T20ల్లో అరంగేట్రం చేశాడు. తరువాత 2022-23 సీజన్ లో గోవాకు మారి ఫస్ట్ క్లాస్, లిస్ట్ A లో ప్రవేశించాడు. IPL లో 2023 సీజన్ లో వాంఖడేలో కోల్‌కతా నైట్ రైడర్స్ పై అరంగేట్రం చేశాడు.
రెడ్ బాల్ క్రికెట్ లో 17 మ్యాచ్ లు ఆడి, 532 పరుగులు (1 శతకం, 2 అర్ధశతకాలు) సాధించాడు. 37 వికెట్లు తీశాడు. లిస్ట్ A క్రికెట్ లో 17 మ్యాచ్ లు ఆడి 76 పరుగులు చేశాడు. IPL లో ముంబై ఇండియన్స్ తరఫున 5 మ్యాచ్ లు ఆడాడు.
సచిన్ టెండూల్కర్ ఇంట్లో ఇటీవల ఓ సందర్భంగా పూజ చేస్తుండగా అంజలి, సారా టెండూల్కర్ తో పాటు పచ్చని కుర్తా ధరించి సానియా చందోక్ కూడా కనిపించింది.
సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో సానియాతో అనేక ఫొటోలు షేర్ చేసింది. ఈ చిత్రాలు రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.