Arshdeep Singh : చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్‌లో సెంచరీ..
పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh ) ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు
- Thota Vamshi Kumar
- Updated on- April 17, 2026 / 09:43 AM IST
Arshdeep Singh creates history becomes first punjab kings bowler to do (pic credit@ipl)
- అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత
- ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయి
- ఈ ఘనత సాధించిన ఏకైక పంజాబ్ పేసర్
Arshdeep Singh : పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ర్యాన్ రికెల్టన్ వికెట్ పడగొట్టి.. పంజాబ్ కింగ్స్ తరుపున ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు.
అంతేకాదండోయ్.. ఐపీఎల్ చరిత్రలో వంద వికెట్లు పడగొట్టిన ఐదో ఎడమ చేతివాటం పేసర్, నాలుగో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్, జయదేవ్ ఉనాద్కత్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్‌లు మాత్రమే అర్ష్‌దీప్ కన్నా ముందు ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం పేసర్లు.
MI vs PBKS : మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అదే.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ఐపీఎల్ అరంగ్రేటం నుంచి అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరుపుననే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతడు 87 మ్యాచ్‌లు ఆడాడు. 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉండగా ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక పంజాబ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ అర్ష్‌దీప్ సింగ్ కొనసాగుతున్నాడు.
7️⃣ Years ❤️
1️⃣0️⃣1️⃣* Wickets ☝️
1️⃣ Arsh Paaji 👑 pic.twitter.com/v9BXsMhUxq— Punjab Kings (@PunjabKingsIPL) April 16, 2026
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (60 బంతుల్లో 112 నాటౌట్) సెంచరీ బాదాడు. నమన్ ధీర్ (31 బంతుల్లో 50) అర్థశతకం చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ లు చెరో వికెట్ తీశారు.
MI vs PBKS : శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. బిత్తరపోయిన రోహిత్, సూర్య.. వీడియో
అనంతరం 196 లక్ష్యాన్ని పంజాబ్ 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (39 బంతుల్లో 80 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 66 పరుగులు) హాఫ్ సెంచరీలు చేశారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.
