Shreyas Iyer Catch: శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. బిత్తరపోయిన రోహిత్, సూర్య.. వీడియో
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో (MI vs PBKS) శ్రేయస్ అయ్యర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.
IPL 2026 MI vs PBKS Rohit Suryakumar Reaction Shreyas Catch Goes Viral
- ముంబైతో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం
- ఆశ్చర్యపోయిన ముంబై ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్
Shreyas Iyer: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో (MI vs PBKS) గెలుపొందింది.
ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసంతో అలరించాడు. అతడి ఫీల్డింగ్ విన్యాసాన్ని చూసిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
*సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు కోలుకోలేని షాక్.. 4 కోట్ల ప్లేయర్ టోర్నీ నుంచి ఔట్..
అసలేం జరిగింది అంటే?
ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈఓవర్ను పంజాబ్ బౌలర్ మార్కో జాన్సెన్ వేశాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. తొలి బంతిని పాండ్యా సిక్స్‌గా మలిచాడు. రెండో బంతి డాట్ అయింది. ఇక మూడో బంతిని పాండ్యా లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న శ్రేయస్ అయ్యర్ అమాంతం గాల్లోకి ఎగిరాడు. బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఆ ఊపులో రోప్ దాటేస్తుండడంతో గాల్లో ఉండగానే బంతిని మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న బార్ట్లెట్ ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.
SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯
🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL
— IndianPremierLeague (@IPL) April 16, 2026
ముంబై డగౌట్‌కు సమీపంలో శ్రేయస్ ఈ ఫీల్డింగ్ విన్యాసం చేశాడు. ఈ మొత్తాన్ని డగౌట్లో కూర్చొని చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు స్టన్ అయ్యారు. వాటే ఏ క్యాచ్ అని సూర్యతో హిట్‌మ్యాన్ అన్నట్లుగా టీవీలో కనిపించింది.
