MI vs PBKS : మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అదే.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ముంబై ఇండియన్స్ పై విజయం సాధించడం పట్ల పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని (MI vs PBKS) వ్యక్తం చేశాడు.
IPL 2026 Shreyas Iyer full happy after Punjab Kings win the match against Mumbai Indians (pic credit@ipl)
- వాంఖడేలో ముంబై పై విజయం
- ఆనందాన్ని వ్యక్తం చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్
- ఆ సవాల్‌కు సిద్దమన్న శ్రేయస్ అయ్యర్
MI vs PBKS : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం పట్ల శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (112 నాటౌట్; 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం బాదాడు. నమన్ ధీర్ (50; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ లు చెరో వికెట్ తీశారు.
అనంతరం 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80 నాటౌట్ ; 39 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (66; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.
ముంబై పై విజయం సాధించడం పట్ల పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాము ఆడుతున్న తీరు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. వరుసగా విజయాలు సాధిస్తుండడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందన్నాడు. అదే సమయంలో విజయాలను చూసి ఉప్పొంగి పోవడం లేదన్నాడు. విజయం కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటామన్నాడు.
ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు తన స్థాయిని పెంచుకున్నాడని తెలిపాడు. గతంలో కూడా అతడు పరుగులు సాధించాడని, అయితే.. ఈ ఏడాది అతడు ఎంతో పరిణతితో ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు ఎంతో మెరుగు అవుతున్నాడని తెలిపాడు. యువ ఆటగాళ్లు ముందుకు వచ్చి మ్యాచ్‌లను ముగించే బాధ్యతలను తీసుకోవడం బాగుందన్నాడు.
MI vs PBKS : శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. బిత్తరపోయిన రోహిత్, సూర్య.. వీడియో
తాను పట్టిన క్యాచ్‌తో పాటు తమ బౌలింగ్ ప్రదర్శన మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్‌గా తెలిపాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో కూడా తాము ఇలాగే రాణించామన్నాడు. టాస్ గెలవడం తన అదృష్టం అన్నాడు. తొలిసారి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన అందుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాలనే కసితో ఉన్నారన్నాడు. భారీ సంఖ్యలో తరలివచ్చి తమకు మద్దతు తెలుపుతున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
