×
Ad

Arshdeep Singh : ఫైన‌ల్ మ్యాచ్‌లో ఓవ‌రాక్ష‌న్‌.. టీమ్ ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ఐసీసీ భారీ జరిమానా..

టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు (Arshdeep Singh) అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది.

Arshdeep Singh fined for breaching ICC Code of Conduct during T20 World Cup

  • డారిల్ మిచెల్‌తో గొడవ‌
  • అర్ష్‌దీప్ సింగ్ కు ఐసీసీ భారీ షాక్‌
  • మ్యాచ్ ఫీజులో 15 శాతం జ‌రిమానా

Arshdeep Singh : టీమ్ఇండియా పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్భంగా.. ఐసీసీ ప్ర‌వ‌ర్త‌న నియమావళి ఉల్లంఘించినందుకు గానూ అత‌డికి జ‌రిమానా విధించింది. అత‌డి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాదండోయ్ అత‌డి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.

అస‌లేం జ‌రిగిందంటే?

ఆదివారం (మార్చి 8) అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను భార‌త పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. వ‌రుస‌గా రెండు బంతుల‌ను కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. దీంతో అర్ష్‌దీప్ తీవ్ర అస‌హ‌నానికి గురి అయ్యాడు. ఆ త‌రువాత ఓ బంతిని మిచెల్ షాట్ ఆడ‌గా.. బాల్‌ను అర్ష్‌దీప్ ఆపాడు.

Virat Kohli : ధోని, రోహిత్ శ‌ర్మ వ‌చ్చారు స‌రే.. విరాట్ కోహ్లీ ఫైన‌ల్ మ్యాచ్‌కు ఎందుకు రాలేదు?

వెంట‌నే బాల్ ను వికెట్ల పైకి విస‌ర‌కుండా డారిల్ మిచెల్ శ‌రీరంపైకి విసిరాడు. దీనిపై మిచెల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఏంటి అన్న‌ట్లుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ప్ర‌శ్నించాడు. అర్ష్‌దీప్ మాత్రం ఏమీ ప‌ట్టించుకోకుండా, క‌నీసం సారీ చెప్ప‌కుండా తిరిగి త‌రువాత బంతిని వేసేందుకు వెళ్లిపోయాడు. అయితే.. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం మిచెల్ వ‌ద్ద‌కు వెళ్లి అత‌డికి స‌ర్దిచెప్పాడు.

Amit Mishra : రోజుల త‌ర‌బ‌డి తిండిపెట్టేవాడు కాదు.. తాగొచ్చి కొట్టేవాడు.. ఐపీఎల్ క్రికెట‌ర్ అమిత్ మిశ్రా పై భార్య ఫిర్యాదు

అంపైర్ న‌చ్చ‌జెప్ప‌డంతో ఓవ‌ర్ పూర్తి కాగానే మిచెల్ కు అర్ష్‌దీప్ సింగ్‌ సారీ చెప్పాడు. తాను కావాల‌ని బంతిని విస‌ర‌లేద‌ని, బాల్ స్వింగ్ అయి మిచెల్‌ను తాకింద‌ని, ఇందుకు అత‌డికి క్ష‌మాప‌ణ చెప్పిన‌ట్లు మ్యాచ్ అనంత‌రం అర్ష్‌దీప్ సింగ్ చెప్పాడు.