Vivo Ipl
IPL 2022: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఐపీఎల్ బరిలోకి రానున్న కొత్త జట్టుకు హెడ్ కోచ్ కానున్నారు. అహ్మదాబాద్ జట్టు రాబోయే సీజన్ ఐపీఎల్ 2022 కన్ఫామ్ అయిపోగా ఆ జట్టుకు హెడ్ కోచ్ గా ఆశిష్ నెహ్రా, టీమ్ మెంటార్ గా గ్యారీ కిస్టన్ ఉండబోతున్నారు. ఐపీఎల్ 15వ ఎడిషన్ లో 10జట్లతో సిద్ధకానుంది టోర్నమెంట్.
లక్నో, అహ్మదాబాద్ రెండు జట్లు రాబోయే సీజన్ కు సిద్ధం అవుతాయి. లక్నో ఫ్రాంచైజీ ను రూ.7వేల 90కోట్లతో ఆర్పీ- సంజీవ్ గోయెంకా కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ జట్టును రూ.5వేల 625కోట్లతో సొంతం చేసుకున్నారు ఇరెలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.
ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ విక్రమ్ సోలంకిని బ్యాటింగ్ కోచ్ గా నియమించుకోనున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బీసీసీఐ అధికారి ఒకరు దీని గురించి ఇలా మాట్లాడారు. కిర్‌స్టన్ టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో నెహ్రా వన్డే జట్టులో కొన్ని మ్యాచ్ లు ఆడాడు. అంతేకాకుండా 2019 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కలిసి పనిచేశారు.
ఇది కూడా చదవండి : టెక్సాస్ లో చేపల వర్షం