Fish Rain : టెక్సాస్ లో చేపల వర్షం

యూఎస్ లోని టెక్సాస్ లో చేపల వర్షం కురిసింది. టెక్సాస్‌లో తుపాను వల్ల కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు ఊడిపడ్డాయి.

Fish Rain : టెక్సాస్ లో చేపల వర్షం

Rained Fish (1)

Fish Rain: యూఎస్ లోని టెక్సాస్ లో చేపల వర్షం కురిసింది. టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుంచి చేపలు ఊడిపడ్డాయి. అమెరికాలో టెక్సాస్‌ రాష్ట్రంలోని టెక్సర్కానా నగరంలో చేపల వర్షం కురిసింది. వానకు ఆకాశం నుచి చేపలు పడ్డా వింత సంఘటనతో స్థానికులు ఆశ్చర్యపోయారు. చేపల వర్షం కురిసిందంటూ టెక్సాస్‌ నగరం ఫేస్‌బుక్‌లో ఫోటో పోస్ట్‌ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా స్పందిస్తున్నారు. “స్వర్గం నుంచి ఉడిపడ్డ చేప” అని ఒకరు అంటే..మరొకరు “డబ్లు వర్షం కూడా పడితే బాగుండును” అంటున్నారు.

ఈ చేపల వర్షం గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతు.. వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు (సుడిగాలి) ఏర్పడుతుంటాయి. అవి భూమ్మీదే కాదు నీటిలో కూడా ఏర్పడుతుంటాయి. అటువంటిసమయాల్లో టోర్నడోలు నీటిపై ప్రయాణించే సమయంలో వాటి వేగానికి ఆ జలాన్ని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. ఆ ఉదృతికి నీటిలో ఉండే చేపలు, కప్పలు వంటి నీటి జీవులు కూడా టోర్నడోలతో పాటుగా పైకి ప్రయాణిస్తాయి.

కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు బలహీనమవుతాయి. ఈ సమయంలో అవి ఘనీభవించిపోతే అవి వర్షాలు కురిసినప్పుడు మేఘాలు వర్షించి నీటితో పాటు వానలో ఈ జీవులు వర్షంతో పాటు పడతాయని తెలిపారు. అంతే తప్ప ఆకాశంలో చేపలు ఉండటం, అవి వర్షంతో పాటు పడటం జరగదని శాస్త్రవేత్తలు తెలిపారు.