చారిత్రాత్మ‌క మైలురాయిని చేరుకున్న అశ్విన్‌-జ‌డేజా జోడీ.. కుంబ్లే-భ‌జ్జీల ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు..

టీమ్ఇండియా స్పిన్ ద్వ‌యం ర‌విచంద్ర‌న్ అశ్విన్‌- ర‌వీంద్ర జ‌డేజాలు అరుదైన రికార్డును అందుకున్నారు.

Ashwin and Jadeja become Indian bowling pair with most wickets in Tests

IND vs ENG 2024 : టీమ్ఇండియా స్పిన్ ద్వ‌యం ర‌విచంద్ర‌న్ అశ్విన్‌- ర‌వీంద్ర జ‌డేజాలు అరుదైన రికార్డును అందుకున్నారు. టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన జోడీగా చ‌రిత్ర సృష్టించారు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచులో ఈ చారిత్రాత్మ‌క మైలురాయిని సాధించారు. నాలుగు వికెట్లు తీసి దిగ్గ‌జ స్పిన్న‌ర్లు అనిల్ కుంబ్లే- హ‌ర్భ‌జ‌న్ సింగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు.

54 టెస్టుల్లో భ‌జ్జీ-కుంబ్లే జోడీ 501 వికెట్లు తీసింది. ఇందులో కుంబ్లే 281 వికెట్లు తీయ‌గా, భ‌జ్జీ 220 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఉప్ప‌ల్ టెస్టులో ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు క్రాలే, డ‌కెట్‌ల‌ను అశ్విన్ ఔట్ చేయ‌గా, పోప్‌, జోరూట్‌ను జ‌డ్డూ పెవిలియ‌న్‌కు చేర‌డంతో వీరిద్ద‌రు ఉమ్మ‌డిగా తీసిన వికెట్ల సంఖ్య 504కి చేరింది. ఇందులో అశ్విన్ 276, జడేజా 228 వికెట్లు తీశారు.

Also Read : ఉప్ప‌ల్ టెస్టులో జో రూట్ రికార్డుల మోత‌.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌

టెస్టుల్లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన జోడీలు

ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర జ‌డేజా – 504 వికెట్లు
అనిల్‌కుంబ్లే, హ‌ర్భ‌జ‌న్ సింగ్ – 501
హ‌ర్భ‌జ‌న్ సింగ్, జ‌హీర్ ఖాన్ – 474
ఉమేశ్ యాద‌వ్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 431

ఇక ఓవ‌రాల్‌గా టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డు ఇంగ్లాండ్ పేస‌ర్లు జేమ్స్ అండ‌ర్స‌న్‌, స్టువ‌ర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్ద‌రు 138 టెస్టు మ్యాచుల్లో 1039 వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ జోడి 81 టెస్టుల్లో 643 వికెట్లతో మొద‌టి స్థానంలో ఉంది.

Also Read : చ‌రిత్ర సృష్టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఒకే ఒక్క భార‌తీయుడు

ట్రెండింగ్ వార్తలు