Joe Root : ఉప్ప‌ల్ టెస్టులో జో రూట్ రికార్డుల మోత‌.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌

ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు.

Joe Root : ఉప్ప‌ల్ టెస్టులో జో రూట్ రికార్డుల మోత‌.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌

Joe Root-Sachin Tendulkar

Joe Root – Sachin Tendulkar : ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్ అరుదైన ఘ‌న‌త అందుకున్నాడు. భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్క‌ర్‌ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా ప్రారంభమైన మొద‌టి టెస్టు మ్యాచులో 10 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రూట్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లోని 21వ ఓవర్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్ట‌డంతో రూట్‌.. భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. రూట్ 45 ఇన్నింగ్స్‌ల్లో 2555 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. స‌చిన్ 53 ఇన్నింగ్స్‌ల్లో 2535 ప‌రుగులు చేశాడు. తాజాగా దీన్ని రూట్ అధిగ‌మించాడు.

Pujara-Rahane : ర‌హానే, పుజారా కెరీర్ ఇక ముగిసిన‌ట్లేనా? టీమ్ఇండియాలో వారిని మ‌ళ్లీ చూడ‌లేం?

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్‌ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు..
జో రూట్ – 2555
సచిన్ టెండూల్కర్ – 2535
సునీల్ గవాస్కర్ – 2348
అలిస్టర్ కుక్ – 2431
విరాట్ కోహ్లీ – 1991

ఇక ఈ మ్యాచ్‌లో రూట్ 60 బంతులు ఎదుర్కొని 29 ప‌రుగులు చేసి జ‌డేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో టెస్టుల్లో టీమ్ఇండియాపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును స‌మం చేశాడు.

టెస్టుల్లో టీమ్ఇండియాపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్లు..
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 2555
జో రూట్ (ఇంగ్లాండ్‌) – 2555
అలిస్ట‌ర్ కుక్ (ఇంగ్లాండ్‌) – 2431
క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్‌) – 2344
జావేద్ మియాందాద్ (పాకిస్తాన్‌) – 2228

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఒకే ఒక్క భార‌తీయుడు