Ravichandran Ashwin : మౌనం వీడిన అశ్విన్‌.. అది ఎంతో బాధించింది

ప్ర‌పంచ‌టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC Final)లో వ‌రుస‌గా రెండో సారి టీమ్ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. తుది జ‌ట్టులో త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై అశ్విన్ స్పందించాడు.

Ravichandran Ashwin

Ashwin: ప్ర‌పంచ‌టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(WTC Final)లో వ‌రుస‌గా రెండో సారి టీమ్ఇండియా(Team India)కు నిరాశే ఎదురైంది. ఓవ‌ల్ వేదిక‌గా ఆస్ట్రేలియా(Australia)తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 209 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. దీంతో 10 ఏళ్ల త‌రువాత ఐసీసీ టైటిల్ గెలుస్తుంద‌ని ఆశించిన అభిమానుల‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. అయితే.. భార‌త తుది జ‌ట్టు ఎంపిక‌లో టెస్టుల్లో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా ఉన్న ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(Ravichandran Ashwin)కు చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ విష‌యం ప‌లువురు మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ మండిప‌డ్డారు.

అయితే.. ఎట్ట‌కేల‌కు తుది జ‌ట్టులో త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై అశ్విన్ స్పందించాడు. మ్యాచ్ మొత్తం పూర్తి అయిన త‌రువాత అశ్విన్ స్పందించ‌డం గ‌మ‌నార్హం. డ‌బ్ల్యూటీసీ విజేత‌గా నిలిచిన ఆసీస్ కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. ఈ విజ‌యానికి క‌మిన్స్ సేన అర్హులేన‌ని అన్నాడు. ఇక త‌న‌ను తుది జ‌ట్టులోకి ఎంపిక చేయ‌క‌పోవ‌డం స్పందిస్తూ అది త‌న‌కు బాధ‌ను క‌లిగించ‌లేద‌న్నాడు. తుది జ‌ట్టులో కేవ‌లం 11 మంది ఆట‌గాళ్ల‌కి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంద‌న్నాడు.

Gautam Gambhir : ధోని వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌లు రాలేదు.. అలా అత‌డిని హీరోని చేశారు.. నిజ‌మైన‌ హీరో గురించి మాత్రం మాట్లాడ‌రు

కండీష‌న్స్ బ‌ట్టి నాలుగో పేస‌ర్‌ను తీసుకోవాల‌ని బావించారు. ఒకే స్పిన్ ఆప్ష‌న్ ఉండ‌డంతో జ‌డేజా వైపు మొగ్గు చూపారు. అయితే.. ఇక్క‌డ న‌న్ను తీవ్రంగా బాధించిన విష‌యం ఏదైనా ఉంది అంటే మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోవ‌డ‌మేన‌ని చెప్పాడు. అయితే మొత్తంగా జ‌ట్టు గెలిచేందుకు చేసిన ప్ర‌య‌త్నాన్ని మాత్రం అభినందించాడు. ఇక ఈ రెండేళ్ల కాలంలో మ్యాచులు ఆడిన జ‌ట్టు స‌భ్యుల‌కు, కోచింగ్ సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2021-23 సైకిల్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలో ర‌విచంద్ర‌న్ అశ్విన్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. 61 వికెట్లు తీశాడు.

Lionel Messi: చైనాలో అర్జెంటీనా సాక‌ర్ దిగ్గ‌జానికి చేదు అనుభ‌వం.. బీజింగ్ విమానాశ్ర‌యంలో అడ్డుకున్న పోలీసులు.. ఆ త‌రువాత‌..

 

ట్రెండింగ్ వార్తలు