Ravichandran Ashwin : ముంబై జట్టులోకి హార్ధిక్ పాండ్యా? అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జట్టు ఎలా ఉంటుందో చెప్పేశాడు.

హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ లో ముంబై జట్టులో ఆడటం నిజమేఅయితే ముంబై ఇండియన్స్ స్వర్ణం కొట్టినట్లే. నేను చదివిన దాన్నిబట్టి చూస్తే ఇది పూర్తిగా డబ్బుతో కూడిన ఒప్పందం అని అశ్విన్ అన్నాడు.

Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్లో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టులో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి చేర్చుకునేందుకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప రాబోయే ఐపీఎల్ లో తిరిగి ముంబయి తరపున హార్దిక్ ఆడటం ఖాయమే. ఇందుకోసం హార్దిక్ కు రూ. 15 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. తాజా వార్తలపై టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్ర అశ్విన్ స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read : Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీకి ఎస‌రు..? కొత్త కెప్టెన్ అత‌డేనా..?

హార్దిక్ పాండ్య వచ్చే ఐపీఎల్ లో ముంబై జట్టులో ఆడటం నిజమేఅయితే ముంబై ఇండియన్స్ గోల్డ్ కొట్టినట్లే. నేను చదివిన దాన్నిబట్టి చూస్తే ఇది పూర్తిగా డబ్బుతో కూడిన ఒప్పందం అని అశ్విన్ అన్నాడు. అయితే, ముంబై జట్టు నుంచి మార్పిడి చేసుకునే ఆటగాళ్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ముంబై ఇలా ట్రేడింగ్ లో ఆటగాళ్లను ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అలా జరుగుతుందని అనుకోవడం లేదని అశ్విన్ అన్నాడు. తొలుత ఐపీఎల్ లో ముంబై ఇండియన్ జట్టు ప్లేయర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా మళ్లీ తిరిగి ఆ జట్టులోకి వెళితే తుది జట్టు ఎలా ఉంటుందో అశ్విన్ చెప్పాడు. మాకు, హార్దిక్ కు మధ్య ఉన్న ఒకేఒక్క తేడా ఏమిటంటే అతను ఐపీఎల్ విన్నింగ్ జట్టు కెప్టెన్. హార్ధిక్ నిర్ణయం గుజరాత్ టైటాన్స్ కు కూడా బ్యాలెన్స్ ను పూర్తిగా మార్చి వేస్తుందని అశ్విన్ అన్నాడు.

Also Read : Shivraj Singh Chouhan: ఇండియా ప్రపంచకప్ ఓడిపోతే వారిద్దరూ సంతోషించారు

హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వెళితే.. ముంబై ఇండియన్ తుది  జట్టు ఎలా ఉంటుందో అశ్విన్ చెప్పాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాంత్ కిషన్,  సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హార్డిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, పీయుష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జోఫ్రా ఆర్చర్ / రైల్ మెరెడిత్ / జేసన్ బెహ్రెండోర్ఫ్ / పాట్ కమిన్స్ .

 

 

 

ట్రెండింగ్ వార్తలు