Courtesy @BCCI
Asia Cup 2025: ఆసియా కప్ లో భాగంగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. 21 పరుగుల తేడాతో ఒమన్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ ఖలీమ్, మిర్జా హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు పడ్డాయి. అయినా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 45 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు. ఒమన్ బౌలర్లలో ఫైజల్, కలీమ్, జితెన్ తలో 2 వికెట్లు పడగొట్టారు.