×
Ad

Sanju Samson : పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌.. సంజూ శాంస‌న్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. పంత్, ధోని రికార్డులు బ్రేక్ చేసే గోల్డెన్ ఛాన్స్‌..

ఆసియాక‌ప్ 2025లో భార‌త్‌, పాక్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు సంజూ శాంస‌న్ (Sanju Samson)ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.

Asia Cup 2025 final Sanju Samson on verge of breaking Rishabh Pant MS Dhoni record

Sanju Samson : ఆసియాక‌ప్ 2025లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య నేడు (ఆదివారం, సెప్టెంబ‌ర్ 28) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, బ్యాట్స్‌మెన్ సంజూ శాంస‌న్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

ఆసియాక‌ప్ 2025లో సంజూ శాంస‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఇన్నింగ్స్‌ల్లో 36 స‌గ‌టు 127.05 స్ట్రైక్ రేటులో 108 ప‌రుగులు చేశాడు. అత‌డు పాక్‌తో జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో గ‌నుక 64 ప‌రుగులు చేస్తే రిష‌బ్ పంత్ పేరిట ఉన్న ఓ రికార్డు అత‌డి సొంతం అవుతుంది.

IND vs PAK : భార‌త్‌తో ఫైన‌ల్‌ మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ స‌ల్మాన్ కామెంట్స్‌.. ఇన్నాళ్లు అందుకే ఓడిపోయాం.. ఇక చూడండి..

టీ20 బ‌హుళ దేశాల టోర్న‌మెంట్‌ల‌లో ఓ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త వికెట్ కీప‌ర్ రికార్డు ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్ పేరిట ఉంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పంత్ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 127.61 స్ట్రైక్‌రేటుతో 171 ప‌రుగులు సాధించాడు. ఇక రెండో స్థానంలో ఎంఎస్ ధోని ఉన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2007లో ధోని 6 ఇన్నింగ్స్‌ల్లో 30.8 స‌గ‌టుతో 154 ప‌రుగులు చేశాడు.

టీ20ల్లో 1000 ప‌రుగులు..

సంజూ శాంస‌న్ 2015 జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. అత‌డు ఇప్ప‌టి వ‌ర‌కు 48 మ్యాచ్‌లు ఆడాడు. 41 ఇన్నింగ్స్‌ల్లో 149.1 స్ట్రైక్ రేట్‌తో 969 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

IND vs SL : భార‌త్, శ్రీలంక మ్యాచ్‌లో దీన్ని గ‌మ‌నించారా?.. నిస్సాంక సిక్స్ కొట్టినా ఒక్క ర‌న్ ఇవ్వ‌ని అంపైర్‌.. ఆ ర‌న్స్ ఇచ్చి ఉంటే..

పాక్‌తో మ్యాచ్‌లో 31 ప‌రుగులు సాధిస్తే.. టీ20ల్లో టీమ్ఇండియా త‌రుపున వెయ్యి ప‌రుగులు పూర్తి చేసుకున్న 12వ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కుతాడు.

అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన వికెట్ కీప‌ర్‌గా..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన భార‌త వికెట్ కీప‌ర్ల జాబితాలో సంజూ శాంస‌న్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 41 ఇన్నింగ్స్‌ల్లో 55 సిక్స‌ర్లు కొట్టాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని రెండో స్థానంలో ఉన్నాడు. 85 ఇన్నింగ్స్‌ల్లో 52 సిక్స‌ర్లు బాదాడు. మూడో స్థానంలో ఉన్న రిష‌బ్ పంత్ 66 ఇన్నింగ్స్‌ల్లో 44 సిక్స‌ర్లు కొట్టాడు.

టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన వికెట్ కీప‌ర్లు వీరే..

* సంజూ శాంస‌న్ – 41 ఇన్నింగ్స్‌ల్లో 55 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 85 ఇన్నింగ్స్‌ల్లో 52 సిక్స‌ర్లు
* రిష‌బ్ పంత్ – 66 ఇన్నింగ్స్‌ల్లో 44 సిక్ప‌ర్లు
* ఇషాన్ కిష‌న్ – 32 ఇన్నింగ్స్‌ల్లో 36 సిక్స‌ర్లు