Asia Cup 2025 Hardik pandya needs 5 sixes to surpass KL Rahul
Hardik pandya : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik pandya)కు స్థానం దక్కింది.
గత కొన్నేళ్లుగా భారత టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. జట్టుకు అవసరం అయిన సందర్భంలో బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించాడు.
Ajit Agarkar : చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్.. 2026 జూన్ వరకు తిరుగులేదు..
2016లో అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 114 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27.9 సగటుతో 1812 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 71 నాటౌట్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 94 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 95 సిక్సర్లు కొట్టాడు. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియాకప్ 2025లో పాండ్యా మరో ఐదు సిక్సర్లు కొడితే అప్పుడు టీమ్ఇండియా తరుపున 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తాడు. కేఎల్ రాహుల్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటాడు. కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 99 సిక్సర్లు కొట్టాడు.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్‌కు జాక్ పాట్..! టీ20 జట్టులో చోటు దక్కకపోయినా..
ఇక ఈ జాబితాలో టీమ్ఇండియా స్టార్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 205 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత 146 సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో కింగ్ కోహ్లీ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో టీమ్ఇండియా తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 83 మ్యాచ్‌ల్లో 146 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 114 మ్యాచ్‌ల్లో 95 సిక్సర్లు
* యువరాజ్ సింగ్ – 58 మ్యాచ్‌ల్లో 74 సిక్సర్లు