Asia Cup 2025: UAEతో మ్యాచ్ బాయ్‌కాట్.. ఇక పాకిస్తాన్ టాటా బైబై ఖతం..

టోర్నీ రూల్స్ ప్రకారం.. గ్రూప్ లో టాప్ 2 జట్లు సూపర్ ఫోర్స్ కు అర్హత సాధిస్తాయి. యూఏఈతో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తే..

Courtesy @ CricInfo

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా తలెత్తిన హ్యాండ్ షేక్ వివాదం.. టోర్నమెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. హ్యాండ్ షేక్ వివాదం తర్వాత పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూఏఈతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని డిసైడ్ అయ్యింది. మరి యూఏఈతో మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే.. నెక్ట్స్ ఏం జరగనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 17న 10వ మ్యాచ్‌లో పాకిస్తాన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో తలపడాల్సి ఉంది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఒకవేళ యుఎఇతో జరిగే మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే.. మహమ్మద్ వసీం నేతృత్వంలోని యుఎఇ జట్టుకు 2 పాయింట్లు లభిస్తాయి. ఈ రెండు పాయింట్లు వారి సంఖ్యను నాలుగుకు పెంచుతాయి. ఇది భారత్ తో పాటు యూఏఈ ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ కు అర్హత సాధించడానికి సరిపోతుంది.

సూపర్ ఫోర్స్ కు భారత్ క్వాలిఫై..

ఈ టోర్నమెంట్ లో భారత్ తన తొలి మ్యాచ్ లో యూఏఈపై ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో 9వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో జరిగిన పోరులో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తుగా ఓడించింది భారత్. రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో సూపర్ ఫోర్స్ కు అర్హత సాధించింది టీమిండియా.

టోర్నీ రూల్స్ ప్రకారం.. గ్రూప్ లో టాప్ 2 జట్లు సూపర్ ఫోర్స్ కు అర్హత సాధిస్తాయి. యూఏఈతో మ్యాచ్ ను పాక్ బాయ్ కాట్ చేస్తే.. ఆ జట్టుకి రెండు పాయింట్లే ఉంటాయి. సూపర్ ఫోర్స్ కు అర్హత సాధించాలంటే ఈ 2 పాయింట్లు సరిపోవు.

ఈ టోర్నీలో పాక్ తన తొలి మ్యాచ్ లో ఒమన్ పై గెలుపొందింది. ఆ మ్యాచ్ లో 93 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఆ తర్వాత భారత్ తో జరిగిన తన రెండో మ్యాచ్ లో పాక్ చిత్తుగా ఓడింది.

భారత్, పాక్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ లో.. పాక్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగిపోవడంతో పాక్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. పాక్ బ్యాటర్లు తేలిపోయారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. 128 పరుగుల టార్గెట్ ను భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్.

యూఏఈతో మ్యాచ్ లో ఆడి గెలిస్తే.. పాకిస్తాన్ జట్టు.. సూపర్ ఫోర్స్ కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూపర్ ఫోర్స్ కు అర్హత సాధిస్తే.. సెప్టెంబర్ 21న ఆదివారం రోజున జరిగే సెకండ్ సూపర్ ఫోర్స్ మ్యాచ్ లో భారత్ తో పాక్ తలపడుతుంది.

Also Read: ఆసియాక‌ప్‌లో నువ్వు లేవు కాబ‌ట్టి స‌రిపోయింది.. ఆ కొట్టుడు ఏందీ సామీ.. 3 ఫోర్లు, 8 సిక్స‌ర్లు.. ఊచ‌కోత‌..