Courtesy @ ESPNCricinfo
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్స్ లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శ్రీలంక టార్గెట్ 203 పరుగులు. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. 2 సిక్సులు, 8 ఫోర్లు బాదాడు. క్రీజులో ఉన్నంత సేపు ధనాధన్ బ్యాటింగ్ ఆడాడు. తిలక్ వర్మ ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 49 పరుగులతో మెరిశాడు. సంజూ శాంసన్ 39 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, చమీర, హసరంగ, షనక, అసలకం తలో వికెట్ తీశారు.