×
Ad

PAK vs SL : యాక్ష‌న్‌.. రియాక్ష‌న్‌.. ‘న‌వ్వు ఒక్క‌సారి చేస్తే.. నేను రెండు సార్లు చేస్తా..’ పాక్ ఆట‌గాడికి ఇచ్చిప‌డేసిన హ‌స‌రంగ‌.. వీడియో వైర‌ల్‌

మంగ‌ళ‌వారం అబుదాబి వేదిక‌గా జ‌రిగిన పాక్‌, శ్రీలంక మ్యాచ్‌లో (PAK vs SL) ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

Asia Cup 2025 PAK vs SL Wanindu Hasaranga and Abrar Ahmed Post Match Act viral

PAK vs SL : ఆసియాక‌ప్ 2025లో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజ‌యం సాధించింది. అబుదాబి వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్ర‌మంలో పాక్ త‌మ ఫైన‌ల్ అవ‌కాశాల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అయితే.. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా కొన్ని ఉద్రిక్త క్ష‌ణాలు చోటు చేసుకున్నాయి. అటు పాక్, ఇటు లంక ఆట‌గాళ్లు ఒక‌రినొక‌రు అనుక‌రించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ స్పిన్న‌ర్ అబ్రార్‌ అహ్మద్ కాస్త అతి చేశాడు. లంక జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ వ‌నిందు హ‌స‌రంగ‌ను ఔట్ చేశాడు. ఆ వెంట‌నే హ‌స‌రంగ‌ను అనుకురిస్తూ అత‌డి శైలిలో సెల‌బ్రేష‌న్ చేసుకుని, ఏవో వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఘ‌ట‌న శ్రీలంక ఇన్నింగ్స్ 13 ఓవ‌ర్ తొలి బంతికి చోటు చేసుకుంది.

IND vs BAN : దుబాయ్ వేదిక‌గా భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య పోరు నేడే.. హెడ్‌-టు-హెడ్ రికారులు చూస్తే ప‌రేషానే..

కాగా.. త‌న‌ను వెక్కిరించినట్లుగా సెలబ్రేట్ చేసుకోవ‌డాన్ని హ‌స‌రంగ మ‌న‌సులో పెట్టుకున్నాడు. పాక్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా కౌంట‌ర్ ఇచ్చాడు. మహీశ్‌ తీక్షణ బౌలింగ్‌లో పాక్ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (17) క్యాచ్‌ అందుకున్న హసరంగ ఆ వెంట‌నే అబ్రార్‌ మాదిరి గాల్లోకి జంప్‌ కొడుతూ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. అంతేనా.. బౌలింగ్‌లో సయీమ్‌ ఆయుబ్‌ (2), కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (5) వికెట్లు తీసిన త‌రువాత కూడా అబ్రార్‌ను అనుక‌రించాడు.

IND vs BAN : భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కోచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ‘మేమే కాదు, ప్ర‌తి జ‌ట్టు టీమ్ఇండియాను ఓడిస్తుంది..’

ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా.. మ్యాచ్ అనంత‌రం ఇరు జ‌ట్లు క‌ర‌చాల‌నం చేసుకునే స‌మ‌యంలో హ‌స‌రంగా, అబ్రార్ మాట్లాడుకున్నారు. ఒక‌రినొక‌రు కౌగ‌లించుకున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 133 ప‌రుగులు చేసింది. క‌మిందు మెండిస్‌ (50; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. పాక్ బౌల‌ర్ల‌లో షహీన్‌ షా అఫ్రిది మూడు, హ‌రిస్ రవూఫ్‌, హుస్సేన్‌ తలాత్ చెరో రెండు వికెట్లు తీశారు. అబ్రాద్ అహ్మ‌ద్ ఓ వికెట్ సాధించాడు.

ఆ త‌రువాత 134 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాక్ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బ్యాట‌ర్ల‌లో నవాజ్ (24 బంతుల్లో 38 నాటౌట్), తలాత్‌ (30 బంతుల్లో 32 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌల‌ర్ల‌లో మ‌హేశ్ తీక్ష‌ణ‌, వ‌నిందు హ‌స‌రంగ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.