Courtesy @ ESPNCricinfo
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరోసారి ఈ టోర్నీలో పాక్ కు భారత్ చేతిలో పరాజయం తప్పలేదు. పాకిస్తాన్ నిర్దేశించిన టార్గెట్ ను టీమిండియా చేజ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల టార్గెట్ ను టీమిండియా 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జట్టుకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ధాటి బ్యాటింగ్ చేశాడు. 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి ఔటయ్యాడు. 6 ఫోర్లు, 5 సిక్సులు బాదాడు. మరో ఎండ్ లో గిల్ చక్కని సహకారం అందించాడు. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. గిల్ 28 బంతుల్లో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 19 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరించాడు. డకౌట్ అయ్యాడు.