Asian Champions Trophy : ఆరోసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌.. సెమీస్‌లో ద‌క్షిణ కొరియా చిత్తు..

ఆసియా పురుషుల హాకీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు దూసుకుపోతుంది.

Asian Champions Trophy hockey India storm into final win over South Korea

Asian Champions Trophy 2024 : ఆసియా పురుషుల హాకీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు దూసుకుపోతుంది. త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ ఫైన‌ల్‌కు చేరుకుంది. సెమీపైన‌ల్‌లో ద‌క్షిణ‌కొరియాను చిత్తు చేసింది. 4-1 తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. ఈ టోర్నీలో భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది ఆరోసారి కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా నాలుగు సార్లు విజేత‌గా నిలిచింది. ఈ సారి కూడా గెలిచి ఐదోసారి ఛాంపియ‌న్‌గా నిలవాల‌ని భావిస్తోంది.

సెమీఫైన‌ల్ మ్యాచులో భార‌త జ‌ట్టు ఆద్యంతం ఆధిప‌త్యం చెలాయించింది. భార‌త ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ (19వ‌, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. ఉత్త‌మ్ సింగ్ (13వ‌), జ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్ (32వ‌)లు చెరో గోల్ చేశారు. ఇక ద‌క్షిణ కొరియా చేసిన ఏకైక గోల్‌ను జిహున్ యంగ్ (33వ‌) చేశాడు.

IND vs BAN : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు.. అందుకుంటాడా?

గ్రూపు ద‌శ‌లో వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది భార‌త్. చైనాను 3-0తో, జపాన్‌ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీఫైన‌ల్‌లోనూ విజ‌యం సాధించి అజేయంగా ఫైన‌ల్‌కు చేరుకుంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. సెప్టెంబ‌ర్ 17 (మంగ‌ళ‌వారం) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.