Asian Games 2023 : చ‌రిత్ర సృష్టించిన ష‌ఫాలీ వ‌ర్మ‌.. సెమీస్ చేరిన భార‌త్‌

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సెమీస్‌కు చేరింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో మ‌లేషియా జ‌ట్టుతో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యింది.

Shafali Verma

Asian Games : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు (India womens cricket team) సెమీస్‌కు చేరింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో మ‌లేషియా జ‌ట్టుతో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యింది. ఈ క్రీడ‌ల్లో భార‌త్ టాప్ సీడ్‌తో బ‌రిలోకి దిగింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయిన‌ప్ప‌టికీ మెరుగైన సీడింగ్ కార‌ణంగా సెమీస్‌కు చేరుకుంది. ఆదివారం సెమీఫైన‌ల్ మ్యాచ్ ను భార‌త్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో గ‌నుక గెలిస్తే భార‌త్ కు ప‌త‌కం ఖాయ‌మ‌వుతుంది.

రెగ్యుల‌ర్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ పై రెండు మ్యాచుల నిషేదం ప‌డ‌డంతో స్మృతి మంధాన నాయ‌క‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 15 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ష‌ఫాలీ వ‌ర్మ (67; 39 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్స‌ర్లు), రోడ్రిగ్స్ (47 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు), స్మృతి మంధాన (27; 16 బంతుల్లో 5 ఫోర్లు), రిచా ఘోష్ (21 నాటౌట్; 7 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. మ‌లేషియా బౌల‌ర్ల‌లో ఇజ్జ‌తీ ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ తీశారు. వ‌ర్షం కార‌ణంగా ఓవ‌ర్ల‌ను కుదించారు.

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు మలేషియా జ‌ట్టు బ‌రిలోకి దిగిన వెంట‌నే వర్షం ప్రారంభ‌మైంది. మ‌లేషియా ఇన్నింగ్స్‌లో రెండు బంతులు మాత్ర‌మే ప‌డ్డాయి. ఎంత‌సేప‌టికీ వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. మెరుగైన సీడింగ్ కార‌ణంగా భార‌త్ సెమీ ఫైన‌ల్ చేరుకుంది.

Sumit Nagal : నంబర్ 1 టెన్నిస్ ఆటగాడిగా ఉన్నప్పటికీ మద్దతు లేదు.. బ్యాంకులో 900 యూరోలు మాత్రమే..

అటు భార‌త పురుషుల జ‌ట్టు కూడా మొద‌టి సారి ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పురుషుల క్రికెట్ మ్యాచులు సెప్టెంబ‌ర్ 27 నుంచి ఆరంభం కానున్నాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 3న ఆడ‌నుంది. ఏ జ‌ట్టుతో అన్న‌ది అక్టోబ‌ర్ 2న తెలియ‌నుంది.

చ‌రిత్ర సృష్టించిన ష‌ఫాలీ వ‌ర్మ‌…

భార‌త ఓపెన‌ర్ షఫాలీ వ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించింది. ఆసియా గేమ్స్ లో అర్థ‌శ‌త‌కం సాధించిన మొద‌టి భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. 31బంతుల్లో ష‌ఫాలీ ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డం విశేషం.

 

ట్రెండింగ్ వార్తలు