Sheetal Devi : చేతులు లేకపోయినా.. 16 ఏళ్లకే ఆర్చరీలో చ‌రిత్ర.. మెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ

వైక‌ల్యం అనేది ప్ర‌తిభ‌కు అడ్డు కాద‌ని నిరూపించింది 16 ఏళ్ల శీత‌ల్ దేవి.

Sheetal Devi created history

Sheetal Devi created history : వైక‌ల్యం అనేది ప్ర‌తిభ‌కు అడ్డు కాద‌ని నిరూపించింది 16 ఏళ్ల శీత‌ల్ దేవి. చేతులు లేక‌పోయినా కూడా చైనాలోని హాంగ్‌జౌ వేదిక‌గా జ‌రుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో ఆర్చ‌రీ విభాగంలో రెండు బంగారు ప‌త‌కాలు గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌త మ‌హిళ‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు శీత‌ల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది.

ముందుగా ఈ వారం ప్రారంభంలో మిక్స్‌డ్ టీమ్ ఆర్చ‌రీ ఈవెంట్‌లో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న శీత‌ల్‌.. శుక్ర‌వారం మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త విభాగంలోనూ బంగారు ప‌త‌కాన్ని సాధించింది. ఇండివిజువల్ కాంపౌండ్ ఈవెంట్‌ ఫైనల్స్‌లో సింగపూర్ కు చెందిన అలీమ్ నూర్ సయాహిదాను 144-142 స్కోరు తేడాతో ఓడించింది. త‌ద్వారా ఒకే ఎడిష‌న్‌లో రెండు బంగారు ప‌త‌కాలు గెలుచుకున్న క్రీడాకారిణిగా రికార్డుల‌కు ఎక్కింది. దీంతో ఆమె పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ త‌దిత‌రులు శీత‌ల్ విజ‌యం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Olympics : భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు…ఏ సంవత్సరంలో అంటే…?

‘ఆసియా పారా గేమ్స్‌లో ఆర్చరీ ఉమెన్స్ ఇండివిజువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన శీతల్ దేవి చూస్తుంటే గ‌ర్వంగా ఉంది. ఇదీ ఆమె ఘనత, పట్టుదల, సంకల్పానికి నిదర్శనం.’ అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు.


‘శీత‌ల్ దేవీ అంద‌రికి స్పూర్తిదాయ‌కం. స్వ‌ర్ణ ప‌త‌కం సాధించినందుకు అభినందలు. ఆమె అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న దేశానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకువ‌చ్చింది.’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Riyan Parag : ప్రపంచ రికార్డును నెల‌కొల్పిన రియాన్ పరాగ్.. టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు..

ఫోకోమెలియా సిండ్రోమ్‌తో జ‌న్మించిన శీత‌ల్‌..

ఫోకోమెలియా సిండ్రోమ్‌తో శీత‌ల్ జ‌న్మించింది. ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారి అవ‌య‌వాలు అభివృద్ధి చెంద‌వు. ఈ కార‌ణంగానే శీత‌ల్ చేతులు అభివృద్ధి చెంద‌లేదు. అయితే.. చిన్న‌త‌నంలో త‌న‌కు చేతులు లేక‌పోవ‌డంతో శీత‌ల్ ఎంత‌గానో బాధ‌ప‌డింది. అయితే.. ఆ త‌రువాత త‌న అంగ‌వైకల్యాన్నీ జ‌యించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో ఆర్చ‌రీ వైపు ఆమె దృష్టి మ‌ళ్లింది. చేతులు లేక‌పోయినా.. కాళ్లు, పాదాల సాయంతో విల్లును ఎక్కుపెట్టి భుజం, త‌ల సాయంతో బాణాన్ని సందించ‌డం నేర్చుకుని ప‌త‌సి ప‌త‌కాల‌ను సాధించి దేశం పేరును నిల‌బెట్టింది.

ట్రెండింగ్ వార్తలు