Asian Para Games: ఆసియా పారా గేమ్స్ ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం

ఆసియా పారా గేమ్స్ లో ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం లభించింది. శుక్రవారం జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్ లో మహిళల ఆర్చరీలో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో సింగపూర్ దేశానికి చెందిన అలీమ నూర్ సయాహిదాను ఓడించింది....

Archer Sheetal Devi

Asian Para Games: ఆసియా పారా గేమ్స్ లో ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం లభించింది. శుక్రవారం జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్ లో మహిళల ఆర్చరీలో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో సింగపూర్ దేశానికి చెందిన అలీమ నూర్ సయాహిదాను ఓడించింది. రెండు షాట్‌లలో అలీమ్ నూర్ మార్క్ మిస్ చేయడంతో శీతల్ గేమ్‌ను కైవసం చేసుకుంది. చివరికి 144-142 స్కోరుతో ఆమె విజేతగా నిలిచింది. గురువారం ఇండోనేషియాలో మొత్తం 82 పతకాలతో భారత్ కొత్త రికార్డును నెలకొల్పింది.

Also Read :  Israel-Hamas war : ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో 50 మంది బందీల మృతి

ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే భారత్ తన సంఖ్యను మరింత పెంచుకోవాలని చూస్తోంది. 2018లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలతో 72 పతకాలు సాధించింది. కానీ ఈసారి హాంగ్‌జౌలో భారతదేశం తనను తాను అధిగమించింది. గేమ్‌లలో తమ అత్యుత్తమ పతకాలను ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఎస్ హెచ్ 6 ఈవెంట్‌లో విశేష కృషితో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న నిత్యా స్రే చారిత్రాత్మక 73వ పతకాన్ని కైవసం చేసుకుంది.