Assam Spinner
Assam Spinner : ఒకప్పుడు వెలుగువెలిగిన వాళ్లు..ఇప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనబడుతుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ..కష్టాల్లో కొంతమంది ఉంటుంటారు. ఒకప్పుడు టీమిండియాకు సాయం చేసిన స్పిన్నర్..ఇప్పుడు రోడ్డు పక్కన టీ అమ్ముకుంటున్నారు. ఇతనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అది 2003 సంవత్సరం. న్యూజిలాండ్ టూర్ కు టీమిండియా వెళ్లేందుకు రెడీ అవుతోంది. కానీ..న్యూజిలాండ్ జట్టులో ఉన్న వెటోరి.. బౌలింగ్ తో భారత క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు.
Read More : Dharamshala Boy : ఏయ్ మాస్క్ పెట్టుకో..అంటున్న ఐదేళ్ల బుడతడు, వీడియో వైరల్
స్పిన్నర్ ప్రకాశ్ భగవత్ : –
దీంతో స్పిన్నర్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే..ఏమి చేయాలని అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చర్చించారు. చివరకు అస్సాం రాష్ట్రానికి చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగవత్ ను పిలిచారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో పాటు పలువురికి బౌలింగ్ చేశారు. భారత బ్యాట్స్ మెన్స్ ముమ్మరంగా ప్రాక్టిస్ చేశారు. అనంతరం న్యూజిలాండ్ స్పిన్నర్ వెటోరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇది అయిపోయిన తర్వాత..అస్సాం తరపున ప్రకాశ్ భగత్ పలు మ్యాచ్ లు ఆడారు.
Read More : Honda Motors : 125 సీసీ “టూ వీలర్” ధరలు పెంచిన హోండా కంపెనీ.
క్రికెట్‌కు దూరం : –
బీహార్ తో జరిగిన ఓ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టడం విశేషం. అస్సాం తరపున దాదాపు అన్ని స్థాయి క్రికెట్ లోనూ ఆడిన అనుభవం ఉంది. అయితే..తండ్రి చనిపోవడంతో క్రమంగా క్రికెట్ కు దూరమయ్యారు. అనంతరం కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ప్రకాశ్ భగత్ రోడ్డు పక్కన టీ, దాల్ రోటీ అమ్ముతూ…జీవనం సాగిస్తున్నారు. అస్సాంలోని Cachar జిల్లా..Silchar పట్టణంలోని takhola ప్రాంతంలో ఇతను నివాసం ఉంటున్నారు.
Read More : Revanth Reddy Padayatra : టీపీసీసీ సమావేశం..కీలక నిర్ణయాలు, త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర!
ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం : –
అస్సాం టీమ్ కి అప్పట్లో తనతో కలిసి ఆడిన క్రికెటర్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారని..కానీ..తాను మాత్రం కష్టం చేసుకుంటూ..టీ షాపు నడుపుకుంటూ…జీవిస్తున్నానని ప్రకాశ్ వెల్లడించారు. తన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, రోజుకు మూడు పూటల భోజనం కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సౌరవ్ గంగూలీకి బౌలింగ్ చేసిన క్షణాలు మరిచిపోలేనవని, దాదాకు తాను బౌలింగ్ చేయడం ద్వారా చాలా నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో..దాదా తనకు విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు.