Dharamshala Boy : ఏయ్ మాస్క్ పెట్టుకో..అంటున్న ఐదేళ్ల బుడతడు, వీడియో వైరల్

Dharamshala Boy : ఏయ్ మాస్క్ పెట్టుకో..అంటున్న ఐదేళ్ల బుడతడు, వీడియో వైరల్

5 Year Old Dharamshala Boy Becomes Police Mascot

Updated On : July 8, 2021 / 4:57 PM IST

5-Year-Old Dharamshala Boy : ఏయ్ మాస్క్ ఏదీ ? మాస్క్ పెట్టుకో..అంటూ ఓ ఐదేళ్ల బుడతడు జనాలను కోరుతున్నాడు. ప్లాస్టిక్ లాంటి కర్రతో మాస్క్ పెట్టుకోని వారిని సున్నితంగా కొడుతున్నాడు. మాస్క్ ఏదీ ? పెట్టుకో అంటూ జనాలను హెచ్చరిస్తున్న ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పాపం మాసిపోయిన దుస్తులు, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా..వస్తూ..పోతున్న జనాలను హెచ్చరిస్తుండడం విశేషం. ఈ ఘటన ధర్మశాలలో చోటు చేసుకుంది.

Read More : Honda Motors : 125 సీసీ “టూ వీలర్” ధరలు పెంచిన హోండా కంపెనీ.

మాస్క్ పెట్టుకోకుండా జర్నీలు : –
కరోనా కారణంగా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అనంతరం కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు సడలిస్తున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సిమ్లాలో పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. ధర్మశాలలో సైతం పర్యాటకులతో సందడి నెలకొంది. అయితే..టూరిస్టులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉందనే విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. చదువుకున్న వారు కూడా మాస్క్ పెట్టుకోకుండా..బహిరంగంగా తిరుగుతుండడం అందర్నీ భయపెట్టిస్తోంది.

Read More : ‘Golgappa Bride’ : పానీపూరి నగలు ధరించిన పెళ్లికూతురు..నోరూరించేస్తోంది..

ధర్మశాలలో నిర్లక్ష్యం : –
ఈ నేపథ్యంలో ఓ బుడతడు ప్లాస్టిక్ కర్ర ఒకటి పట్టుకుని మాస్క్ లు పెట్టుకోవాలని వచ్చి పోయే వారికి బుద్ధి చెబుతున్నాడు. కొంతమంది దీనికి సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పెద్ద వాళ్లు ఇతడిని చూసి..నవ్వుకుంటూ పోతున్నారే తప్ప..మాస్క్ కూడా పెట్టుకోలేకపోవడం వీడియోలో కనిపించింది. కనీసం అతడికి చెప్పులు లేవు.

Read More : Kim Jong Un : 20 కిలోల బరువు తగ్గిన కిమ్ జోంగ్ ఉన్
స్పందించిన పోలీసులు, నెటిజన్లు : –

ఇతను తల్లిదండ్రుల ఆదాయానికి తోడుగా నిలుస్తున్నాడు. మార్కెట్ లలో బుగ్గలు, ఇతరత్రా అమ్ముతున్నాడు. ఈ విషయం స్థానికంగా ఉన్న పోలీసులకు తెలిసింది. ఆ బుడతడి పేరు అమిత్ అని తెలుసుకున్నారు. వెంటనే అతని వద్దకు వచ్చి సత్కరించారు. ఓ టోపీ, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందచేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో…పలువురు నెటిజన్లు స్పందించారు. అతనికి సహాయం అందిస్తున్నారు. ఓ వృద్ధ దంపతులు బట్టలు అందించారు. అతని విద్యకు నిధులు సమకూర్చాలనే విన్నతులు పెల్లుబికుతున్నాయి.