Kim Jong Un : 20 కిలోల బరువు తగ్గిన కిమ్ జోంగ్ ఉన్

నియంతలకే నియంతగా ముద్రపడ్డ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది.

Kim Jong Un : 20 కిలోల బరువు తగ్గిన కిమ్ జోంగ్ ఉన్

Kim

Kim Jong Un నియంతలకే నియంతగా ముద్రపడ్డ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది. ఉత్తర కొరియా గురించైనా, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ గురించైనా బాహ్య ప్రపంచానికి అత్యంత అరుదుగా మాత్రమే సమాచారం అందుతుంటుంది. తాజాగా కిమ్‌కి సంబంధించిన బాహ్య ప్రపంచానికి లీకైన ఓ సమాచారం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి చిక్కిపోయినట్లుగా గత నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. కిమ్ బరువు తగ్గినట్లు కన్పిస్తున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే కిమ్ జోంగ్ ఉన్ 10-20కిలోల(44 పౌండ్లు) బరువు తగ్గినట్లు తాజాగా దక్షిణ కొరియాకి చెందిన చట్టసభ సభ్యుడు కిమ్ బయుంగ్ కీ మీడియాకి తెలిపారు. నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లేదా స్పై ఏజెన్సీకి అందిన సమాచారం ప్రకారం కిమ్ ఇటీవల 10 నుండి 20 కిలోగ్రాముల (44 పౌండ్ల) మధ్య నష్టపోయాడని గురువారం బయుంగ్ కీ మీడియాకి తెలిపారు. అయితే అతని పాలనను ప్రభావితం చేసే పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ కిమ్ కి లేవని దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడు తెలిపారు. కిమ్ ఆరోగ్యంలో అసాధారణత ఉంటే.. కిమ్ ఆరోగ్యానికి బాధ్యత వహించే క్లినిక్‌ కు మందులు దిగుమతి అవుతున్నట్లు సంకేతాలు ఉండాలి, కానీ అది కనుగొనబడలేదు అని బయుంగ్ కీ చెప్పారు. అంతేకాకుండా కిమ్ జోంగ్ ఉన్ ఇంకా.. గంటల పాటు సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాడని మరియు అతని నడకలో కూడా అసాధారణమైనది ఏమీ లేదని బయుంగ్ కీ చెప్పారు.

మరోవైపు,ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. డజను అరటి పండ్లు,ఒక కప్పు టీ ధరలు వేలల్లో ఉన్నట్లు సమాచారం. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రతరం కాకముందే నివారణ చర్యలు చేపట్టాలని ఇటీవలే కిమ్ అధికారులను ఆదేశించారు. ఓ వైపు కరోనా కారణంగా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడంతో చైనా వంటి పొరుగుదేశాలతో వాణిజ్యం నిలిచిపోడం,అదేవిధంగా తుపాన్ లు,వరదల కారణంగా పంటల నష్టంతో కొరియాలో ప్రస్తుత పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. మిసైల్, న్యూక్లియర్ పరీక్షలను నిరంతరంగా సాగిస్తుందన్నవల్ల ఈ దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆయా దేశాల నుంచి అందాల్సిన సాయం కూడా నిలిచిపోయింది. 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, కిమ్ మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఉత్తర కొరియాలో 1990లో తీవ్రమైన కరువు కారణంగా వేలాది మంది ప్రజలు చనిపోయారు. ప్రస్తుత ఆహార సంక్షోభం నేపథ్యంలో మళ్లీ ఆనాటి పరిస్థితులు పునరావృతమవుతాయా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి