భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తన పుట్టినరోజు సందర్భంగా తన కూతురి పేరును, ఆ పాప మొట్టమొదటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులకు ఇటీవల పాప పుట్టిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఆ పాపకు సంబంధించిన ఫొటోను కేఎల్ రాహుల్ షేర్ చేయలేదు.
ఇవాళ కేఎల్ రాహుల్‌తో పాటు అతియా శెట్టి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పాప ఫొటోను పోస్ట్ చేస్తూ ఆమెకు ఇవారా అని పేరు పెట్టినట్లు చెప్పారు. ఆ పాపను కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఎత్తుకున్నప్పుడు తీసుకున్న ఫొటో ఇది. “ఇవారా దేవుడి కానుక” అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఇవారా అంటే సంస్కృతంలో భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని అర్థం.
కేఎల్ రాహుల్ పోస్ట్ చేసిన ఫొటోపై హీరోయిన్ సమంత స్పందించింది. లవ్ లవ్ లవ్ అని సూచించేలా మూడు సార్లు లవ్ సింబల్ పెట్టింది. సమంతతో పాటు పలువురు ప్రముఖులు దీనిపై స్పందిస్తూ కేఎల్ రాహుల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కేఎల్ రాహుల్ పుట్టినరోజు సందర్భంగానూ ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెప్పారు.
కాగా, అతియా శెట్టిని కేఎల్ రాహుల్ 2023లో పెళ్లిచేసుకున్నాడు. అతియా శెట్టి గత నెల 25న పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు. బాలీవుడ్‌లో అతియా శెట్టి పలు సినిమాల్లో నటించింది.