AUS vs ENG 3rd Test Australia won by 82 runs against England in 3rd test
AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. వరుసగా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో (AUS vs ENG) 82 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను మరో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.
435 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 207/6తో ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 145 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 352 పరుగులకు ఆలౌటైంది.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. ఎవరెవరు ఇన్? ఎవరెవరు ఔట్?
Australia retain the #Ashes in a five-day thriller!
Break it all down here: https://t.co/hpOH2iNVYU pic.twitter.com/OHtexAI8DC
— cricket.com.au (@cricketcomau) December 21, 2025
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (85), జేమీ స్మిత్ (60) హాఫ్ సెంచరీలు చేశారు. విల్ జాక్స్ (47), జో రూట్ (39), బ్రైడన్ కార్స్ (39*), హ్యారీ బ్రూక్ (30) లు పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ లైయన్ లు తలా మూడు వికెట్లు తీశారు. స్కాట్ బోలాండ్ ఓ వికెట్ పడగొట్టాడు.
హెడ్ దూకుడు..
అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (219 బంతుల్లో 170; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీ చేశాడు. అలెక్స్ కేరీ (72) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు తీశాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 371, ఇంగ్లాండ్ 286 పరుగులు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.