T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. ఎవరెవరు ఇన్? ఎవరెవరు ఔట్?
టీ20 ప్రపంచకప్ 2026కు ( T20 World Cup 2026) భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది

భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి.

బీసీసీఐ.. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించింది.

15 మంది సభ్యుల గల బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత జట్టు ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగనుంది.

అతడికి డిప్యూటీగా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు.

పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న శుభ్‌మన్ గిల్ పై వేటు పడింది.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్‌ను సెలక్టర్లు కరుణించారు.

శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్),

రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్,

వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

ఇదే జట్టు కివీస్‌తో జవనరి 21 నుంచి జరగనున్న ఐదు మ్యాచ్ టీ20 సిరీస్‌లోనూ ఆడనుంది.

