AUS vs SA 2nd ODI Cameron Green equals all time Australia record
Cameron Green : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) అరుదైన ఘనత సాధించాడు. ఓ వన్డే మ్యాచ్‌లో ఔల్ ఫీల్డ్‌లో ఆస్ట్రేలియా తరుపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న అరుదైన జాబితాలో చేరాడు.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అతడు నాలుగు క్యాచ్‌లు (ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్) అందుకోవడం ద్వారా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
మార్క్ టేలర్, మైఖర్ క్లార్క్, ఆండ్రూ సైమండ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
Shreyas Iyer : నిన్న జట్టులో చోటు, నేడు వన్డే కెప్టెన్సీ ఛాన్స్.. రెండూ మిస్సాయే..
ఓ వన్డే మ్యాచ్‌లో ఔట్ ఫీల్డ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆసీస్ ఆటగాళ్లు వీరే..
*మార్క్ టేలర్ – 4 క్యాచ్‌లు (1992)
* మైఖేల్ క్లార్క్- 4 క్యాచ్‌లు (2004)
* ఆండ్రూ సైమండ్స్ – 4 క్యాచ్‌లు (2006)
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 4 క్యాచ్‌లు (2015)
* మిచెల్ మార్ష్ – 4 క్యాచ్‌లు (2016)
* గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 4 క్యాచ్‌లు (2017)
* మార్నస్ లబుషేన్ – 4 క్యాచ్‌లు (2024)
* కామెరూన్ గ్రీన్ – 4 క్యాచ్‌లు (2025)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే (88; 78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (74; 87 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీశాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, లబుషేన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 37.4 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిష్ (87; 74 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాప్ సెంచరీ చేశాడు. కామెరూన్ గ్రీన్ (35) రాణించాడు. లబుషేన్ (1), మిచెల్ మార్ష్ (18), అలెక్స్ కేరీ (13), ఆరోన్ హార్డీ (10) లు విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. నండ్రే బర్గర్, సేనురన్ ముత్తుసామి లు చెరో రెండు వికెట్లు తీశారు. వియాన్ ముల్డర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు 24న ఆదివారం జరగనుంది.