Shreyas Iyer : నిన్న జట్టులో చోటు, నేడు వన్డే కెప్టెన్సీ ఛాన్స్.. రెండూ మిస్సాయే..
వన్డేల్లో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ కార్యదర్శి ..

BCCI Secretary Devajit Saikia reacted to Shreyas Iyer ODI Captaincy rumors
Shreyas Iyer : సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్ 2025 కోసం భారత జట్టును ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక తరువాత టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గురించే చర్చ నడుస్తోంది.
దేశవాళీతో పాటు ఐపీఎల్‌లో రాణించడంతో పాటు మంచి ఫాలో ఉన్నప్పటికి కూడా అయ్యర్‌కు చోటు ఇవ్వకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదే సమయంలో వన్డేల్లో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ తరువాత అతడు వన్డే క్రికెట్‌లో అతడికి బీసీసీఐ కెప్టెన్సీ ఇవ్వనున్నట్లు సదరు వార్తల సారాంశం. అయితే.. ఈ రూమర్ల పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ ఆంగ్లమీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
తాను ఈ వార్తలను విన్నానని, అయితే.. అలాంటి ఓ చర్చ మాత్రం ఇంత వరకు జరగలేదన్నారు. దీంతో శ్రేయస్ అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ వార్తలు అబద్దం అని తేలిపోయింది.
Sanju Samson : ఆసియాకప్ 2025కి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం.. ఓపెనర్ కాదని చెప్పేశారా?
గిల్ కే బీసీసీఐ మద్దతు!
38 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి అతడికి 40 ఏళ్లు నిండుతాయని, ఈ క్రమంలోనే ఓ యువ ఆటగాడికి వన్డే పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని వార్తలు వస్తున్నాయి.
వన్డే ఫార్మాట్‌లో శ్రేయస్ అయ్యర్ గణాంకాలు చాలా బాగున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ భారీగానే పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్సీ రేసులో అయ్యర్ ముందు వరసలో ఉంటాడు అన్నది కానదలేని వాస్తవం.
అదే సమయంలో ఇటీవలే టెస్టు పగ్గాలు అందుకున్న గిల్ సైతం వన్డే కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అయితే.. బీసీసీఐ మద్దతు గిల్ కే ఉన్నట్లుగా తెలుస్తోంది.