AUS vs WI : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. 6.5 ఓవ‌ర్ల‌లో ముగిసిన వ‌న్డే!

ఆస్ట్రేలియా పురుషుల జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. త‌మ వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అతి పెద్ద గెలుపును అందుకుంది.

AUS vs WI 3rd odi

Australia vs West Indies : ఆస్ట్రేలియా పురుషుల జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. త‌మ వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అతి పెద్ద గెలుపును అందుకుంది. అది కూడా వ‌న్డే క్రికెట్‌లో 1000వ మ్యాచులో కావ‌డం గ‌మ‌నార్హం. కాన్‌బెర్రా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 259 బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. వ‌న్డే ఫార్మాట్‌లో అతి త‌క్కువ బంతుల్లో ఫ‌లితం తేలిన ఆరో మ్యాచ్‌గా ఈ మ్యాచ్ రికార్డుల‌కు ఎక్కింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. 24.1 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. వెస్టిండీస్ బ్యాట‌ర్ల‌లో అలిక్ అథనాజ్ (32), కేసీ కార్తీ (10), రోస్ట‌న్ ఛేజ్ (12) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించ‌గా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జేవియర్ బార్ట్‌లెట్ నాలుగు వికెట్ల‌తో వెస్టిండీస్ ప‌త‌నాన్ని శాసించాడు. లాన్స్ మోరిస్, ఆడ‌మ్ జంపా లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. సీన్ అబాట్ ఓ వికెట్ తీశాడు.

MS Dhoni : ధోనీ తన స్వస్థలంలో దేవరీ ఆలయాన్ని సందర్శించారు.. అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్

ఈ ల‌క్ష్యాన్ని ఆసీస్ 6.5 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెన‌ర్లు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (41; 18 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స‌ర్లు), జోష్ ఇంగ్లిస్ (35నాటౌట్; 16బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) దంచికొట్టారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను వైట్ వాష్ చేసింది.

కాగా..ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డేల్లో నేటి మ్యాచే అతి త‌క్కువ బంతుల్లో ఫ‌లితం వ‌చ్చిన మ్యాచ్‌గా రికార్డుల‌కు ఎక్కింది.

ట్రెండింగ్ వార్తలు