ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్‌‌కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కీలక ప్లేయర్ ఔట్ ..

వన్డే వరల్డ్ కప్‌కోసం 18మందితో కూడిన ప్రిలిమనరీ (ప్రాథమిక) జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

Cricket Australia

World Cup 2023: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకోసం 18మందితో కూడిన ప్రిలిమనరీ (ప్రాథమిక) జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు ఫ్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహించనున్నాడు. మెగాటోర్నీకంటే ముందు ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వన్డేలు ఆడుతుంది. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేలు, భారత్ పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా తొలి వన్డేతో భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

Tilak Varma: తొలి టీ20 ఫిఫ్టీ వేడుక రోహిత్ భాయ్‌ కుమార్తెకోసమన్న తిలక్ వర్మ .. ఎందుకో తెలుసా? వీడియో వైరల్

వరల్డ్ కప్‌లో భాగస్వామ్యం అయ్యే జట్టు సభ్యుల వివరాలను సెప్టెంబర్ 5లోపు ఆయా  జట్లు ఐసీసీకి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ సమయానికి ప్రస్తుతం ఎంపికైన 18మందిలో 15మందిని క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న టీమిండియాతో తలపడనుంది. టెస్టుల్లో టాప్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ వన్డే ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. సెలక్లర్లు అతన్ని పక్కకు పెట్టారు. అతడు జనవరి 2020 నుంచి ఆసీస్ ఆడిన 38 మ్యాచ్ లలో 30కి ప్రాతినిధ్యం వహించాడు. అయినా, అతడిని సెలెక్టర్లు పరిశీలనలోకి తీసుకోలేదు. యువ ఆల్‌రౌండర్ ఆరోన్ హార్దీ, స్పిన్నర్ తన్వీర్ సంగాకు తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది.

IND vs WI 2nd T20 Match: అంతా వారే చేశారు..! భారత్ జట్టు ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు..

వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు..

పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్టిస్, కెమెరాన్ గ్రీన్, అరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, అడమ్ జంపా, ట్రావిస్ హెడ్. మార్నస్ స్టొయినిస్.