Steve Smith : లిఫ్ట్‌లో చిక్కుకున్న ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. గంటసేపు టెన్షన్
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. సాయం కలం సరదాగా గడపాలని వెళ్తుండగా లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు
- kunduru Vinod
- Published On : December 31, 2021 / 11:51 AM IST
Steve Smith
Steve Smith : ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో యాషెస్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి కాగా.. ఇదో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 9 తేదీ వరకు జరగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్ ముగించుకొని హోటల్ రూమ్‌కి వచ్చారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. అనంతరం ఆ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మద్యంలోనే ఆగిపోయింది. దీంతో 55 నిమిషాలపాటు అందులోనే ఒంటరిగా ఉండిపోయాడు స్టీవ్.
చదవండి : Ashes 2021-22 : కెప్టెన్ స్టీవ్ స్మిత్ పడుకోకుండా..ఏం చేస్తున్నాడో తెలుసా ?
ఇక తాను లిఫ్ట్ లో చిక్కుకుపోయిన విషయాన్నీ ప్రతి క్షణం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అప్డేట్ ఇచ్చాడు స్టీవ్. ఇక ఇదే సమయంలో స్టీవ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా జట్టు మరో ఆటగాడు మార్నస్ లాబుషెన్ బయటివైపు నుంచి లిఫ్ట్ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడివల్లకాలేదు. చాలాసేపటితర్వాత హోటల్ టెక్నిషియన్ వచ్చి లిఫ్ట్ డోర్ తీయడంతో సురక్షితంగా బయటపడ్డారు స్టీవ్.. లిఫ్ట్ లోంచి బయటకు వస్తున్న స్టీవ్ కు చప్పట్లతో స్వాగతం పలికారు క్రికెటర్లు.
Content we want more of: Steve Smith stuck in a lift ? [H/T @abi_slade] pic.twitter.com/ZhzuTXmYJZ
— Cricket Shouts (@crickshouts) December 30, 2021
