బుమ్రా లేకుండా బరిలోకి: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్

  • Publish Date - December 4, 2020 / 01:42 PM IST

Australia vs India, 1st T20I -కాన్‌బెర్రాలోని మానుకా ఓవల్(Manuka Oval, Canberra) వేదికగా.. భార‌త్ జట్టు ఆతిథ్య జట్టు ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధ‌మైంది. వన్డే సిరీస్ ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాల‌ని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుని, భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.



ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యమై టీమ్‌తో బరిలోకి దిగుతుంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ లేని భారత్.. రవీంద్ర జడేజా మరియు వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. అలాగే సంజు శాంసన్‌కు శ్రీయాస్ అయ్యర్ బదులుగా మిడిల్ ఆర్డర్‍‌లో అవకాశం లభిస్తుంది. ఇక ముఖ్యంగా మ్యాచ్‌లో బుమ్రా లేడు. బుమ్రాకి ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి లభించింది.



India (Playing XI): శిఖర్ ధావన్, KL రాహుల్(WK), విరాట్ కోహ్లీ(C), మనీష్ పాండే, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, టి నటరాజన్
Australia (Playing XI): ఆర్కీ షార్ట్, ఆరోన్ ఫించ్ (C), మాథ్యూ వేడ్ (WK), స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మోయిసస్ హెన్రిక్స్, మిచ్ స్వెప్‌సన్, సీన్ అబోట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హాజిల్‌వుడ్