Commonwealth Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌‌లో ఫస్ట్ టైమ్ క్రికెట్‌.. షెడ్యూల్‌ ఇదే..!!

కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి.

Commonwealth Cricket

Womens Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. భారత్‌ మహిళల జట్టు తొలి ప్రత్యర్థి ఎవరంటే..వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగబోతున్నాయి. ఈ క్రీడల్లో ఫస్ట్ టైమ్ క్రికెట్‌కు ప్లేస్ రాగా.. ఈ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. జులై 29వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరగబోతున్నాయి.

ఈ క్రీడల్లో క్రికెట్‌కి సంబంధించి షెడ్యూల్‌ని విడుదల చేశారు. ఈ క్రీడలు టీ20 ఫార్మాట్‌లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనుండగా.. ఫస్ట్ గేమ్ భారత్‌-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగబోతుంది. భారత్, ఆస్ట్రేలియాలతో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు ఆడబోతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు ఏడవ తేదీన జరగనుండగా.. మహిళల క్రికెట్‌ ఈవెంట్స్‌కు సంబంధించి మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడబోతున్నాయి.

గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌ ఉండగా.. గ్రూప్‌- బిలో ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ జట్లుగా ఉన్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ క్రికెట్‌ పోటీలు జరగనుండగా.. మొత్తం టీ20 ఫార్మట్‌లో సాగనున్నాయి. 29న ఆస్ట్రేలియా మ్యాచ్‌ తర్వాత భారత్‌ 31న పాకిస్తాన్‌తో తలపడనుంది.

అనంతరం ఆగస్టు 3న బార్బడోస్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. రెండు గ్రూపులలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుతాయి. సెమీస్‌ మ్యాచ్‌లు ఆగస్టు6న జరగనున్నాయి. అందులో గెలిచిన జట్లు ఆగస్టు 7వ తేదీన బంగారు పతకం కోసం.. అదే రోజు సెమీస్‌లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం పోటీ పడతాయి. మొత్తం మూడు పతకాలు జట్లకు దక్కనున్నాయి.

Commonwealth Cricket