Australian cricketer Usman Khawaja
Australian cricketer Usman Khawaja: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ 2023 టెస్ట్ సిరీస్ జరుగుతుంది. మొదటి టెస్టులో రెండో రోజు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. సెంచరీ చేయగానే తన బ్యాట్‌ను గాలిలోకి విసిరేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Usman Khawaja
టెస్టు క్రికెట్‌లో ఖవాజాకు ఇది 15వ సెంచరీ. ఇంగ్లాండ్ గడ్డపై ఇదే తొలి సెంచరీ. ఆ తరువాత 137 పరుగుల వద్ద ఖవాజా ఔట్ అయ్యాడు. రెండోరోజు అద్భుత బ్యాటింగ్ చేసిన ఖవాజా మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడటానికి వచ్చే క్రమంలో అతన్ని కుతురు ఐషా వదిలేందుకు నిరాకరించింది. దీంతో ఖవాజా అలానే మీడియా సమావేశంకు వచ్చారు. కుమార్తెను ఒడిలో కూర్చోబెట్టుకొని మీడియాతో మాట్లాడటం ప్రారంభించాడు.
Ashesతన కూతురు ఉండటం వల్ల తన సమయం పరిమితం కావచ్చునని ఖవాజా జర్నలిస్టులను కోరారు. అయితే, ఖవాజా కుమార్తె ఐషా తన చెల్లెలు ఐలా గురించి మీడియా ప్రతినిధులు ఆరా తీయగా.. ఖవాజా మాట్లాడుతూ.. అవును, బేబీ ఐలా ఇక్కడ లేదు. ఆమె వాళ్ల అమ్మతో ఉంది. మేము త్వరలో తిరిగి వెళ్తాము. రెండు నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి అని కోరారు.
Suryakumar Yadav : 30 సెకన్లలో 3 రోజులు.. దేవీషాతో సూర్యకుమార్ యాదవ్
ఖవాజా మాట్లాడుతున్న సమయంలో ఐషా.. మీడియా మైకులు ఉంచిన టేబుల్‌పై రికార్డింగ్ కోసం ఉంచిన ఫోన్‌లను అందుకొనే ప్రయత్నం చేసింది. దీంతో ఉస్మాన్ కుమార్తెను వారించడం, ఆ వెంటనే ముద్దుపెట్టుకోవటం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/eurosport/status/1670164851363311616?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1670164851363311616%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=about%3Asrcdoc