Viral Video : ఇలా ఉన్నారేంట్రా బాబు.. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచినా గుర్తు ప‌ట్ట‌ని వైనం.. ఇది నిజంగా స్టార్ క్రికెట‌ర్ల‌కు అవ‌మాన‌మే..!

భార‌తదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Australians Failing To Recognise Pat Cummins video Goes Viral

Viral Video : భార‌తదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్లేయ‌ర్ల‌ను అభిమానులు ఎంతో ఆరాధిస్తారు. మ్యాచులు గెలిస్తే పండ‌గ‌లు చేసుకుంటారు. భారత‌దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ వంటి దేశాల్లో క్రికెట్ కు మంచి ఆద‌ర‌ణే ఉంది. ఇక ప్ర‌పంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా గుత్తాధిప‌త్యం చెలాయించిన వైనాన్ని క్రికెట్ ప్రేమికులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు.

గ‌తేడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పాట్ క‌మిన్స్ సార‌థ్యంలో ఆసీస్ ఫైన‌ల్ మ్యాచులో భార‌త్‌ను ఓడించి ప్ర‌పంచ క‌ప్‌ను ముద్దాడింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ శ‌త‌కంతో ఆసీస్‌కు విజ‌యాన్ని అందించాడు. ఇక వీరిద్ద‌రికి ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

పాక్ స్వ‌ర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అతని మామ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా.. షాకవ్వాల్సిందే..!

అయితే.. స్వదేశంలో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ యువ‌కుడు వీధిలో వెలుతున్న వారిని మీరు పాట్ క‌మిన్స్‌, ట్రావిస్ హెడ్ గురించి విన్నారా…? అని ప్ర‌శ్నించాడు. అయితే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా చాలా మంది ఈ ఇద్ద‌రు క్రికెట్ గురించి తెలియ‌ద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఓ వ్య‌క్తి మాత్రమే ఆస్ట్రేలియా టెస్టు, వ‌న్డేను గుర్తించారు. ఈ విష‌యంలో త‌న‌కు ఎలాంటి ఆలోచ‌న‌లు లేవ‌న్నాడు. ఇక వీడియో చివ‌ర‌లో భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి మాత్రం విరాట్ కోహ్లీ గురించి విన్నాను. కానీ ఇద్ద‌రు క్రికెట‌ర్ల గురించి తెలియ‌ద‌న్నాడు.

నర్సా అనే యూజ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది ఆస్ట్రేలియాలోనిది కాద‌ని, వేరే ప్రాంతంలో తీసిన వీడియో కావొచ్చున‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కొంద‌రు ఆసీస్ అభిమానులు మాత్రం త‌మ దేశంలో క్రికెట్ అంత‌రించిపోతుందేమోన‌న్న కామెంట్లు చేస్తున్నారు.

Paris Olympics 2024 : ముగిసిన పారిస్ ఒలింపిక్స్ .. అమెరికాదే అగ్రస్థానం.. అదిరిపోయిన ముగింపు సంబరాలు

ట్రెండింగ్ వార్తలు