×
Ad

IND vs SA: మిల్లర్ బ్యాడ్‌లక్.. బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్ తో పెవిలియన్ బాటపట్టాడు.

Axar Patel

Axar Patel takes stupendous catch : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సులు, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి తను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిశేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్ తో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 219 పరుగులు చేసింది.

Also Read: IND vs SA : కెప్టెన్ సూర్యకుమార్ గదికి వెళ్లి తిలక్ వర్మ ఏమని అడిగాడో తెలుసా.. సీక్రెట్ బయటపెట్టిన సూర్య

భారీ స్కోర్ చేధనలో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఫలితంగా 15 ఓవర్లకు 134 పరుగులకే దక్షిణాఫ్రికా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 16 ఓవర్ హార్దిక్ పాండ్యా వేశాడు. ఆ ఓవర్లో చివరి బంతిని హార్దిక్ షార్ట్ డెలివరీ వేయగా.. మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. బంతి బౌండరీ లైన్ బయటపడే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ గాల్లోకి ఎగిరి అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.