IPL 2024 : 2014 ఐపీఎల్ సీజ‌న్‌లో నమోదైన రికార్డును బద్దలుకొట్టిన బదోని, అర్షద్ జోడీ

ఐపీఎల్ చరిత్రలో 160 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించే సమయంలో లక్నో సూపర్ జెయింట్ జట్టును ఓడించిన ..

Ayush Badoni and Arshad Khan

IPL 2024 LSG vs DC : ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అదరగొట్టింది. శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39), బదోని (55 నాటౌట్), అర్షద్ (20 నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో సూపర్ జెయింట్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో పంత్ సేన విజయం సాధించింది.

Also Read : IPL 2024 : రిషబ్ పంత్, ఫ్రేజర్ విజృంభణ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ విజయం..!

ఐపీఎల్ చరిత్రలో 160 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో సూపర్ జెయింట్ జట్టును ఓడించిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు బ్యాటర్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. లక్నో జట్టుకు చెందిన బదోని, అర్షద్ ఎనిమిదో వికెట్ కు 73 పరుగులు రాబట్టారు. ఐపీఎల్ చరిత్రలో ఎనిమిదో వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2014లో రాజస్థాన్ తరపున బ్రాడ్ హాడ్జ్, ఫాల్క్ నర్ కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం గత రికార్డును బదోని, అర్షద్ బద్దలు కొట్టారు.

Also Read : Rohit Sharma : త‌న రిటైర్‌మెంట్ పై రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2024 ఐపీఎల్ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడిన పంత్ సేన.. కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.

 

 

ట్రెండింగ్ వార్తలు