IPL 2024 : రిషబ్ పంత్, ఫ్రేజర్ విజృంభణ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ విజయం..!

IPL 2024 DC vs LSG : ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

IPL 2024 : రిషబ్ పంత్, ఫ్రేజర్ విజృంభణ.. 6 వికెట్ల తేడాతో లక్నోపై ఢిల్లీ విజయం..!

Rishabh Pant lead Delhi Capitals to win by 6 wickets

IPL 2024 : ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఈ సీజన్‌లో ఢిల్లీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్నో సొంతమైదానంపై జరిగిన మ్యాచ్‌లో ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే సూపర్ జెయింట్స్ జట్టుపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఢిల్లీ సునాయసంగా ఛేదించింది. ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ (41; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు)తో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఓపెనర్ పృథ్వీ షా (32; 22 బంతుల్లో 6 ఫోర్లు)తో రాణించగా, మిగతా ఆటగాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ (15), షాయ్ హోప్ (11), డేవిడ్ వార్నర్ (8)పరుగులకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులతో లక్నోను చిత్తుగా ఓడించింది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకోగా, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు.

ఆయుష్ బదోనీ హాఫ్ సెంచరీ వృథా :
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (19) పరుగులకే చేతులేత్తేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. ఆయుష్ బదోనీ (55; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మిగతా ఆటగాళ్లలో అర్షద్ ఖాన్ (20), దీపక్ హుడా (10), కృనాల్ పాండ్యా (3), మార్కస్ స్టోయినిస్ (8) పరుగులకే పరిమితమయ్యారు. నికోలస్ పూరన్ ఖాతా కూడా తెరవలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 7 వికెట్ల నష్టానికి 167 పరుగుల చేసి ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ :
ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో లక్నో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఖలీల్ అహ్మద్ (41/2) వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ తలో వికెట్ తీసుకున్నారు. లక్నో (3/20 పరుగులు) వికెట్లు పడగొట్టిన ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది

టాప్ 4లో లక్నో :
పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 4 ఓడింది. ఫలితంగా సీజన్‌లో 2వ విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడి 6 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.

3వేల పరుగుల మైలురాయి.. 3వ అతిపిన్న వయస్కుడిగా రిషబ్ పంత్ :

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పంత్ అద్భుతమైన ప్రదర్శనతో జట్టును 6 వికెట్ల తేడాతో గెలిపించడంతో ఢిల్లీ ఈ సీజన్‌లో 2వ విజయాన్ని అందుకుంది. 12వ ఓవర్ చివరి డెలివరీలో రిషబ్ పంత్ మార్కస్ స్టోయినిస్ వేసిన బంతిని ఫోర్ కొట్టి 24 బంతుల్లో 41 పరుగుల మైలురాయిని చేరుకోవడం ద్వారా 3వేల ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.

దాంతో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ తర్వాత 3వేల పరుగుల మార్క్‌ను చేరుకున్న 3వ పిన్న వయస్కుడిగా పంత్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 3వేలకుపైగా పరుగులు చేసిన 25 మంది బ్యాటర్లలో పంత్ స్ట్రైక్-రేట్ (148.4), ఏబీ డివిలియర్స్ 151.68, క్రిస్ గేల్ 148.96 కన్నా వెనుకబడి ఉంది.

  • శుభ్‌మన్ గిల్ : 24ఏళ్ల 215 రోజులు
  • విరాట్ కోహ్లీ : 26ఏళ్ల 186 రోజులు
  • రిషబ్ పంత్ : 26 ఏళ్ల 191 రోజులు
  • సంజు శాంసన్ : 26ఏళ్ల 320రోజులు
  • సురేష్ రైనా : 27ఏళ్ల 161 రోజులు

Read Also : Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు.. దాన్ని అత‌డు ఒప్పుకోవ‌డం లేదు : కివీస్ మాజీ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు