Babar Azam : పాక్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలగబోతున్నాడా..? మీడియా ప్రశ్నకు క్లారిటీ ఇచ్చేశాడు

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్సీ నుంచి వైదొలిగే విషయంపై ఎప్పుడు ప్రకటన చేస్తున్నారని విలేకరులు బాబర్ అజంను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ..

Babar Azam

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన పాక్.. కేవలం నాలుగు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. ఈ జట్టుకు సెమీస్ ఆశలను దాదాపు చేజారిపోయాయి. ముఖ్యంగా పాక్ జట్టు భారత్, ఆఫ్గానిస్థాన్ జట్లపై ఓడిపోవటంతో పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ జట్టు మాజీలు జట్టు సభ్యుల పై విమర్శలు చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలగాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్ టోర్నీ తరువాత పాక్ కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలిగేందుకు సిద్ధమయ్యాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Also Read : పాక్ జట్టుకు అగ్నిపరీక్ష.. సెమీస్ కు చేరాలంటే ఇంగ్లాండ్ పై ఎన్ని పరుగులతో గెలవాలో తెలుసా? సాధ్యమవుతుందా..

పాక్ మీడియా కథనాల ప్రకారం.. మెగా టోర్నీ ముగిసిన తరువాత ఆజం పరిమిత ఓవర్ల క్రికెట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతాడని తెలుస్తోంది. ఇందులో భాగంగా పాక్ కు తిరిగి వెళ్లిన తరువాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజాతోపాటు మరికొందరిని కలిసి బాబర్ ఆజం తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని ప్రచారం జరుగుతుంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకు పాక్ కెప్టెన్ గా కొనసాగడంపై బాబర్ నిర్ణయం తీసుకోబోతున్నాడని, అయితే, కొందరు మాజీలు ఇప్పటికే బాబర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచనలు చేసినట్లు పాక్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం.. ఇంటి బాట ప‌ట్టిన అఫ్గానిస్థాన్‌

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్సీ నుంచి వైదొలిగే విషయంపై ఎప్పుడు ప్రకటన చేస్తున్నారని విలేకరులు బాబర్ అజంను ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. నా దృష్టి మొత్తం తదుపరి మ్యాచ్ పైనే ఉందని బాబర్ ఆజం అన్నారు. ప్రపంచ కప్ లో కెప్టెన్సీ మీ ఫామ్ ను ప్రభావితం చేసిందని, పరుగులు రాబట్టడంలో విఫలం కావడానికి కెప్టెన్సీ ఒత్తిడే కారణమా అని విలేకరులు ప్రశ్నించగా.. గత మూడేళ్లుగా నేను నా జట్టుకు కెప్టెన్ గా ఉన్నాను. నేను ఎప్పుడూ ఈ విధంగా భావించలేదని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు