Babar Azam Should Play Domestic Cricket Now says Virender Sehwag
Babar Azam : గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ అనంతరం టెస్టు జట్టు నుంచి బాబర్ ఆజామ్‌ను తప్పించారు. ఈ క్రమంలో బాబర్‌కు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని కీలక సూచనలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడడంతో పాటు శారీరకంగానే కాకుండా మానసికంగా ఫిట్‌నెస్ సాధించి జట్టులో చోటు దక్కించుకోవాలన్నాడు.
షోయబ్ అక్తర్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఇటీవల పేలవ ప్రదర్శన చేస్తున్న బాబర్ పై మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని సూచించాడు. “బాబర్ అజామ్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలి. అతను తన ఫిట్‌నెస్‌పై పని చేయాలి, కుటుంబంతో కొంత సమయం గడపాలి. ఆపై శారీరకంగా, మానసికంగా దృఢమైన ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావాలి” అని సెహ్వాగ్ అన్నాడు.
బాబర్ తనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తోంది సెహ్వాగ్ చెప్పాడు. కెప్టెన్సీకి రాజీనామా చేసిన తరువాత మానసికంగా ఎంతో ప్రభావితం అయినట్లుగా కనిపిస్తున్నట్లుగా అభిప్రాయపడ్డాడు. ఇది అతడి టెక్నిక్‌ను ప్రభావితం చేసినట్లుంది. అందుకనే ముందు అతడు మానసికంగా ధృడంగా మారాలి. బాబర్ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇలాంటి ప్లేయర్లు చాలా త్వరగా తిరిగి పుంజుకుంటారు అని సెహ్వాగ్ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేయడంతో పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ముల్తాన్‌లో ఇంగ్లాండ్ జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులు మాత్రమే చేశాడు. 2022 డిసెంబర్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో బాబర్ కనీసం ఒక్క అర్థశతకాన్ని కూడా నమోదు చేయలేదు. ఇక రెండో టెస్టులో అతడి స్థానంలో కమ్రాన్ గులామ్‌ను ఎంపిక చేయగా అతడు సెంచరీతో సత్తా చాటాడు. దీంతో బాబర్‌కు రీ ఎంట్రీ కష్టమే క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ కీలక సూచనలు చేశాడు.
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ ‘ఢిల్లీ’ ప్రతిపాదన?