T20 World Cup 2024 : తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు భారీ ప్రైజ్‌మనీ.. భారత జట్టుకు ఎంతో తెలుసా?
మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది.

Womens T20 World Cup 2024 What is the prize money for champions New Zealand
మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ట్రోఫీని సొంతం చేసుకున్న న్యూజిలాండ్ కు ప్రైజ్‌మనీగా ఎంత దక్కింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత దక్కింది. గ్రూప్ స్టేజిలోనే నిష్ర్కమించిన భారత్ ఎంత మొత్తం లభించిందో ఓ సారి చూద్దాం.
గతంతో పోలిస్తే ఈ సారి పెద్ద మొత్తంలో ఐసీసీ ప్రైజ్‌మనీని పెంచింది. $7,958,080 (సుమారు ₹ 66.5 కోట్లు)ను ప్రపంచకప్ ఆరంభానికి ముందే ఐసీసీ ప్రకటించింది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీగా దక్కింది. అంటే భారత కరెన్సీ దాదాపు రూ.19.67 కోట్లు. ఇక రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.9.8 కోట్లు దక్కింది.
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ ‘ఢిల్లీ’ ప్రతిపాదన?
ఇక సెమీస్‌లో ఓడిపోయిన రెండు జట్లు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌కు చెరో రూ.5 కోట్ల 65లక్షలు లభిస్తాయి. అంతేకాదండోయ్ గ్రూప్ దశలో ఒక్కొ జట్టు గెలిచిన మ్యాచ్‌కు రూ.26 లక్షల చొప్పున దక్కనున్నాయి. అంటే.. ఊదాహారణకు.. న్యూజిలాండ్ కు ప్రైజ్‌మనీ కాకుండా గ్రూపు దశలో ఎన్ని మ్యాచులు గెలిచిందో ఒక్కొ మ్యాచ్‌కు రూ.26లక్షల చొప్పున అదనంగా దక్కనుంది. అన్ని జట్లకు ఇది వర్తిస్తుంది.
ఇక ఐదు నుంచి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచిన జట్లకు ఒక్కొ జట్టుకు రూ.2.25 కోట్లు చొప్పున లభించనుంది. ఇంకా తుది ర్యాంకింగ్స్ విడుదల కాలేదు. అయితే.. భారత్ ఆరో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఈ లెక్కన భారత్‌కు రూ.2.25 కోట్లు దక్కనున్నాయి.
Archery World Cup : ఆర్చరీ ప్రపంచకప్.. దీపికా కుమారికి రజతం..