Archery World Cup : ఆర్చ‌రీ ప్ర‌పంచ‌క‌ప్.. దీపికా కుమారికి ర‌జ‌తం..

ఆర్చరీ వరల్డ్ కప్‌లో భార‌త స్టార్ ఆర్చ‌ర్ దీపికా కుమారి ర‌జ‌తంతో స‌రిపెట్టుకుంది.

Archery World Cup : ఆర్చ‌రీ ప్ర‌పంచ‌క‌ప్.. దీపికా కుమారికి ర‌జ‌తం..

Deepika Kumari bags her fifth silver at Archery World Cup 2024

Updated On : October 21, 2024 / 10:24 AM IST

Archery World Cup 2024 : ఆర్చరీ వరల్డ్ కప్‌లో భార‌త స్టార్ ఆర్చ‌ర్ దీపికా కుమారి ర‌జ‌తంతో స‌రిపెట్టుకుంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన లి జియామ‌న్ చేతిలో ఓడిపోయింది. ఫైన‌ల్ మ్యాచులో లి జియామ‌న్ ప్ర‌తి రౌండ్‌లోనూ మెరుగ్గా రాణించింది. ఫ‌లితంగా 0-6 తేడాతో దీపికపై గెలుపొందింది. స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ముద్దాడింది. దీంతో దీపికా ర‌జ‌తంతో సంతృప్తి ప‌డాల్సి వ‌చ్చింది.

2022లో దీపిక‌కు కూతురు జ‌న్మించింది. దాదాపు మూడేళ్ల అనంత‌రం అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది. సెమీఫైన‌ల్ వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది ప‌డ‌లేదు. అయితే.. ఫైన‌ల్‌లో మాత్రం త‌డ‌బాటుకు గురైంది. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో తొమ్మిది సార్లు పోటీప‌డిన దీపికా.. ఐదు ర‌జ‌తాల‌ను సొంతం చేసుకుంది. ఓ సారి కాంస్య ప‌త‌కాన్ని అందుకుంది.

NZW vs SAW Final: రెండోసారి విఫలమైన సౌతాఫ్రికా.. టీ20 విశ్వ విజేతలుగా న్యూజిలాండ్ అమ్మాయిలు

2007లో డోలా బెన‌ర్జీ మాత్ర‌మే భార‌త్ త‌రుపున స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది.

ఇక పురుషుల రిక‌ర్వ్ విభాగంలో తెలుగు తేజం ధీర‌జ్ బొమ్మ‌దేవ‌ర ఓడిపోయాడు. పారిస్ కాంస్య పతక విజేత, దక్షిణ కొరియా ఆర్చర్ లీ వూ సియోక్ చేతిలో 4-2తేడాతో ధీరజ్ ఓట‌మిని చ‌విచూశాడు.

Shreyas Iyer : జ‌ట్టులోకి నేనొస్తా.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌