NZW vs SAW Final: రెండోసారి విఫలమైన సౌతాఫ్రికా.. టీ20 విశ్వ విజేతలుగా న్యూజిలాండ్ అమ్మాయిలు

పురుషులు, మహిళల క్రికెట్ రెండింట్లోనూ న్యూజిలాండ్ నెగ్గిన తొలి టీ20 ప్రపంచకప్ ఇదే కావటం గమనార్హం. మహిళల న్యూజిలాండ్ జట్టు 2009, 2010లో ..

NZW vs SAW Final: రెండోసారి విఫలమైన సౌతాఫ్రికా..  టీ20 విశ్వ విజేతలుగా న్యూజిలాండ్ అమ్మాయిలు

New Zealand Womens team

Updated On : October 21, 2024 / 7:36 AM IST

Womens T20 World cup 2024 Final Highlights: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను న్యూజిలాండ్ జట్టు గెలుచుకుంది. తుదిపోరులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ అమ్మాయిలు అదరగొట్టారు. ఒత్తిడిని అధిగమించి దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు.. ఫలితంగా టీ20 విశ్వవిజేతగా నిలిచారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు లక్ష్య చేధనలో విఫలమైంది. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికా అమ్మాయిలు చేయగలిగారు. ఫలితంగా 32 పరుగుల తేడాతో కివీస్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టులో అమేలియా కెర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 38 బంతుల్లో 43 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ అదరగొట్టింది.

Also Read: KL Rahul : టెస్టుల‌కు కేఎల్ రాహుల్ రిటైర్‌మెంట్‌? తొలి టెస్టు ఓట‌మి త‌రువాత రాహుల్ చేసిన ప‌ని దేనికి సంకేతం?

న్యూజిలాండ్ ఆటగాళ్లు మొదటి నుంచి ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 13ఓవర్లు పూర్తయ్యే సరికి కివీస్ స్కోర్ 85 పరుగులు మాత్రమే. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆఖరి ఏడు ఓవర్లలో 73 పరుగులు రాబట్టారు. అమేలియా కెర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికైంది. మరోవైపు మహిళల టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్ లో ఓడిపోయింది. 2023లో ఆ జట్టు తుదిపోరులో ఆస్ట్రేలియా జట్టుపై ఓడిపోగా.. తాజాగా న్యూజిలాండ్ జట్టు పై ఓటమి పాలైంది.

Also Read: ఆ విషయంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ

పురుషులు, మహిళల క్రికెట్ రెండింట్లోనూ న్యూజిలాండ్ నెగ్గిన తొలి టీ20 ప్రపంచకప్ ఇదే కావటం గమనార్హం. మహిళల న్యూజిలాండ్ జట్టు 2009, 2010లో రన్నరప్ గా నిలిచింది. పురుషుల జట్టు 2021 ఫైనల్లో ఓడింది. వన్డే ప్రపంచకప్ లో అమ్మాయిల జట్టు 2000 సంవత్సరంలో విజేతగా నిలవగా.. పురుషుల జట్టు ఏదీ గెలవలేదు.